వైసీపీ అధినేత జగన్ సుదీర్ఘ పాదయాత్ర ఉత్తరాంధ్రకు కడు సమీపానికి వచ్చేసింది. మరో నాలుగు రోజులలో  తుని బోర్డర్ దాటడం ద్వారా జగన్ విశాఖ జిల్లాలో పాదం మోపనున్నారు. వానలు కురిసినా ఇకపై  పాదయాత్ర ఆపకూడదని జగన్ కీలక నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో మరింత తొందరగా విశాఖ వైపు అధినేత వస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.


పల్లెలను టచ్ చేస్తూనే :


ఈ నెల ఇరవై తరువాత జగన్ విశాఖ పొలిమేరలలో అడుగు పెడతారని పార్టీ వర్గాల సమాచారం. జగన్ పాద యాత్ర మొత్తం పల్లెలను కవర్ చేస్తూ సాగుతుందని చెబుతున్నారు. రూట్ మ్యాప్ అలా డిసైడ్ చేసారు. దానివల్ల విశాఖ సిటీతో పాటు, ఆ పరిధిలోని అయిదారు నియోజక వర్గాలు మిగిలిపోతాయి. వీటిని ఆ తరువాత బస్సు యాత్ర ప్రత్యేకంగా చేపట్టి జగన్ కవర్ చేస్తారని వైసీపీ నేతలు అంటున్నారు.


వేయి కళ్ళతో ఎదురు చూపు :


జగన్ పాదయాత్ర ఈ వారంతంలో జిల్లాలోకి వస్తుందని తెలియడంతోనే అభిమానులు, అనుచరులు సంబరపడుతున్నారు. పాదయాత్ర కోసం వారంతా వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం  అయితే మార్చి, ఏప్రిల్ నాటికల్లా రావాలి. అయితే భారీ జన సందోహం మధ్య పాదయాత్ర సాగడంతో ఎక్కడికక్కడ బాగా లేట్ అవుతోందంటున్నారు. 


వైఎస్ అంటే ప్రాణం :


ఉత్తరాంధ్ర జిల్లాలు వైఎస్ అంటే ప్రాణం పెడతాయి. ప్రతిపక్షంలో ఉన్నా, సీఎం గా ఉన్నా రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతనికి  వస్తే చాలు జనం బ్రహ్మరధం పట్టేవారు. వైఎస్ సైతం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేవారు. ఇక్కడ నుంచే ఆయన తన పోరాటాలను మొదలుపెట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉత్తరాంధ్ర కాంగ్రెస్ లీడర్ ద్రోణం రాజు సత్యనారాయణతో కలసి నాటి కాంగ్రెస్ సీఎంలకు వ్యతిరేకంగా వైఎస్ పూరించిన సమర శంఖం  అప్పట్లో సూపర్  సక్సెస్ అయింది.  2004, 2009 ఎన్నికలలో కూడా జనం భారీగా సీట్లు ఇచ్చి జేజేలు పలికారు. అదే తీరున జగన్ కి సైతం నీరాజనం అందిస్తారని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: