అమెరికన్లను దిగ్భ్రాంతికి గురిచేసే మరో విస్మయం కలిగించే అనూహ్యమైన వ్యాఖ్యలు చేశారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌! అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కంటే తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మాటలనే ఎక్కువగా విశ్వసిస్తానని వ్యాఖ్యానించి ప్రపంచంలోనే సంచలనం రేపారు. 18 నెలల క్రితం అమెరికా దేశాధ్యక్షుడ యిన డొనాల్డ్ ట్రంప్, 18 సంవత్సరాలుగా రష్యాని ఏకచత్రాధిపత్యంగా పాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్. ఆ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రెండు అగ్ర దేశాలకు అధిపతులు. అనేక అంశాల్లో పోటీ కారణంగా ఈ రెండు దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ఘర్షణాత్మక వాతావరణమే నెలకొంది. అయితే ఇప్పడు కొత్తగా మైత్రి కోసం ఇరు దేశాధినేతలూ ప్రయత్నించారు. 


అమెరికా, రష్యాల మధ్య సంబంధాల ప్రభావం ప్రపంచంలోని మిగతా దేశాలపై కూడా ఉంటుంది కాబట్టి వీరి భేటీకి అంత ర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. భేటీ అనంతరం ఇద్దరు నేతలూ సానుకూలంగా స్పందించారు. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూసిన సమావేశం సోమవారం ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకీ లో జరిగింది. మొదట ఇరువురు నేతలూ ఏకాంతంగా సమావేశమయ్యారు. వారి వెంట అనువాదకులు మాత్రమే ఉన్నారు. ఆ తరువాత ఇద్దరూ కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
 trump putin meet at helsanki కోసం చిత్ర ఫలితం
"నేను పుతిన్‌ ను సూటిగా అడిగాను. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తలదూర్చిందా? ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందా?" అని ప్రశ్నించగా, ఆయన దానిని పూర్తిగా తిరస్కరించారు. నేను ఆయనను విశ్వసిస్తున్నా" అని డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. వెంటనే ఒక విలేకరి "ఎఫ్‌బీఐ రష్యా పాత్ర ఉందని చెబుతోంది. ఎఫ్‌బీఐ, పుతిన్‌ లలో దేనిని ఎక్కువ నమ్ముతారు?" అని ప్రశ్నించగా రష్యాను నమ్మకపోవడానికి నాకు కారణాలేవీ కనిపించలేదు అని వెంటనే ట్రంప్‌ బదులిచ్చారు. మరో ఆసక్తి కరమైన అంశమేంటంటే ట్రంప్‌ అధ్యక్షుడవ్వాలని తాను కోరుకున్నానని పుతిన్‌ ఈ సమావేశానికి ముందు చెప్పడం! "ఆయన అధ్యక్షుడైతే ఇరుదేశాల సంబంధాలు మెరుగు పడ తాయని నేను భావించాను" అని పుతిన్‌ అన్నారు. "నేను సుదీర్ఘకాలం అమెరికా అధ్యక్షపదవిలో ఉండను ఇప్పటికే రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మాత్రం కొనసాగుతాయని భావిస్తున్నా" అని ట్రంప్‌ చెప్పారు.
 

రష్యాతో ఇంతకాలం సత్సంబంధాలు లేకపోవడానికి అమెరికా పిచ్చితనం, మూర్ఖత్వమే కారణమని డొనాల్డ్ ట్రంప్‌ అంతకు ముందు ట్వీట్‌ చేశారు. ఆయన వైఖరిపై ఆయన సొంత పార్టీ రిపబ్లికన్‌ పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. "2016 ఎన్నికల్లో రష్యా కలగజేసుకున్న మాటనిజం. ఈ విషయాన్ని ట్రంప్‌ పుతిన్‌కు చెప్పలేకపోయారు. ఇంత అవమానకరంగా ఏ అమెరికా అధ్యక్షుడూ గతంలో ప్రవర్తించలేదు. పుతిన్‌ పాదాల చెంత ఆయన దాసోహమయ్యారు-అమెరికా ప్రతిష్ఠను దిగజార్చారు" అని సీనియర్‌ సెనేటర్లు జాన్‌ మెకైన్‌, లిండ్సే గ్రాహమ్‌, జెఫ్‌ ఫ్లేక్‌ లతో పాటు హిల్లరీ క్లింటన్‌ సహా డెమోక్రాట్ నేతలతో పాటు ప్రతిష్ఠాత్మక అమెరికా మీడియా కూడా విమర్శించింది. 

trump putin meet at helsanki కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: