అదేంటో నాలుగేళ్ళ కాలంలో ఎపుడూ కాంగ్రెస్ కి ఈ బుధ్ధి పుట్టలేదు. ఏపీని అడ్డగోలుగా విభజించామన్న బాధ కూడా లేదు. సరిగ్గా బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ వంటి చిన్న పార్టీ ప్రత్యేక హోదాపై అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప అటు టీడీపీకి, ఇటు కాంగ్రెస్ కి తెలిసొచ్చింది కాదు. మొత్తానికి వర్షాకాల సమావేశాలలో మేమూ హోదాపై పోరాడుతాం, అవిశ్వాస నోటీస్ కూడా ఇస్తామంటున్నారు ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ 


ఎర్రకోట వీరుడు ఆయనేట :


వచ్చే ఏడు ఆగస్ట్ 15న ఎర్ర కోటపై జెండా ఎగరేసేది రాహుల్ గాంధీయేనని చాందీ గారు చిలక జోస్యం కూడా చెబుతున్నారు. ఆరు నూరైనా రాహుల్ ప్రధాని కావడం ఖాయమట. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమూ అంతే ఖాయమట.   రాహుల్ పెట్టే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్  మీదనే అన్నారాయన. దేశానికి కాంగ్రెస్ అవసరం ఉందంటున్న పెద్దాయన తమకు అధికారాలు కొత్తేమీ  కాదంటున్నారు. ప్రజల కోసం అంకితం అయిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని నొక్కి వక్కాణిస్తున్నారు.


బీద పార్టీకి రూపాయి ఇవ్వాలట :


కాంగ్రెస్ ని బతికించడం కోసం ఏపీలోని ప్రతి ఇంటి నుంచి ఒక్క రూపాయి విరాళంగా ఇవ్వాలని ఉమెన్ చాందీ పిలుపు ఇస్తున్నారు. ఏపీలో బూత్ లెవెల్ కమిటీలను 44 వేల వరకు వేస్తామని, ప్రతి మండలానికి, పట్టనానికి, నియోజకవర్గానికి పార్టీ ఇంజార్జ్ లను కూడా నియమించి యుధ్ధానికి రెడీ అవుతామని భారీ  స్టేట్మెంట్ ఇచ్చేశారు. అలాగే, అక్టోబర్ 31 నుంచి నవంబర్ 19 వరకు ఇంటింటికీ కాంగ్రెస్ పేరిట భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: