బయటకు విడిపోయినట్లు కనిపిస్తూ లోలోపల బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తోందంటూ టీడీపీపై   ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు బొత్స సత్యనారాయణ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాబు రాజగురువు రామోజీరావుని కలుసుకుని రహస్య మంతనాలు సాగించిన గుట్టు బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. మళ్ళీ ఆ పార్టీతో అంటకాగేందుకు బాబు తెగ తాపత్రయపడుతున్నారనటూ అటాక్ చేశారు. మీరు, మీరు కలుస్తూ మాపై నిందలు వేస్తారా అంటూ గుస్సా అయ్యారు.


అందులోనే నంబర్ వన్ :


ఏపీ అవినీతిలోనే నంబర్ వన్ గా ఉందని బొత్స తేల్చేశారు. 1500 రోజుల పాలనంటూ  డబ్బాలు కొట్టుకుంటున్న బాబు జమానా అంతా అక్రమాలు, అన్యాయాల పుట్ట అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలు గాలికి వదిలేశారు, పాత పధకాలకే పేర్లు మార్చి ఇందిరమ్మ ఇళ్ళనే మావని చెప్పుకుంటున్నారని కౌంటర్లేశారు. . కులాల సంక్షేమం  కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశామంటున్నారు, ఎక్కడకి పోయాయి ఆ నిధులంటూ నిగ్గదీశారు.


అది బయటకి  తీయాలి :


టీడీపీ సర్కార్ కి దమ్ముంటే సిట్ నివేదికను బయటకు తీయాలని బొత్స డిమాండ్ చేశారు. విశాఖలో వేల ఎకరాలు దోచుకున్నారంటూ మండిపడ్డారు. భాగస్వామ్య సదస్సు పేరిట వస్తాయన్న లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో కూడా బాబే జవాబు చెప్పాలన్నారు. . బాబు పాలన ఇలా ఉంటే ఏదో చేసేసినట్లు సంబరాలు ఎందుకని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: