చంద్ర‌బాబునాయుడుపై బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు చేశారు. త‌న ఫోన్ల‌ను చంద్ర‌బాబు ట్యాపింగ్ చేయిస్తున్నారంటూ  క‌న్నా చేసిన ఫిర్యాదు రాష్ట్ర రాజ‌కీయాల్లో క‌ల‌కలం రేపుతోంది. తెలుగుదేశంపార్టీ నేత‌ల అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెడుతున్న వారిపై ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోందంటూ మండిప‌డ్డారు.  బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తో పాటు ప్ర‌భుత్వ అవినీతిని ప్ర‌శ్నించినందుకు తన‌తో పాటు, సోము వీర్రాజుపైన జ‌రిగిన దాడుల‌ను గుర్తు చేశారు. 


బిజెపి నేత‌ల‌పై దాడులు

Image result for tdp attack on amit shah

ఓటుకునోటు కేసులో చంద్ర‌బాబు ఇరుకున్న విష‌యాన్ని క‌న్నా త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఆ కేసులో ఏ టెక్నాల‌జీ ఆధారంగా అయితే ఇరుకున్నారో అదే టెక్నాల‌జీని ఇపుడు త‌న ప్ర‌త్య‌ర్ధుల‌పై చంద్ర‌బాబు ప్ర‌యోగిస్తున్న‌ట్లు క‌న్నా ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌తో ఎవ‌రెవ‌రు మాట్లాడుతున్నారో తెలుసుకునే విష‌య‌మై త‌న ఫోన్ల‌ను పోలీసులు ట్యాప్ చేస్తున్న‌ట్లు ఫిర్యాదులో మండిప‌డ్డారు. కాబట్టి త‌న ఫిర్యాదుపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా క‌న్నా కోరారులేండి.


అన్నీ సీట్లకు పోటి


రాబోయే ఎన్నిక‌ల్లో అన్నీ అసెంబ్లీ, పార్లెమెంటు సీట్ల‌కు బిజెపి పోటీ చేస్తుందంటూ క‌న్నా స్ప‌ష్టం చేశారు. ఒ్గంట‌రిగా పోట చేయ‌టానికి త‌మ పార్టీ నిర్ణ‌యించుకున్న‌ట్లు కూడా చెప్పారు. రాష్ట్రంలో శాంతి, భ‌ద్ర‌త‌లు దెబ్బ‌తిన్న‌ట్లు క‌న్నా మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై దాడులు బాగా పెరిగిపోయాయ‌న్నారు. త‌న 40 ఏళ్ళ రాజ‌కీయ జీవితంలో ఇంత అధ్వాన్న‌మైన పాల‌న‌ను చూడ‌లేదంటూ మండిప‌డ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: