ఏపీ సీఎం చంద్రబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కలిశారు. సోమవారం సెక్రటేరియట్‌లో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటంపై కొద్ది రోజుల క్రితం సీఎంకు ఉండవల్లి లేఖ రాశారు. సీఎం కార్యాలయం ఆహ్వానం మేరకు ఉండవల్లి అమరావతికి వచ్చి బాబుతో ఆయన భేటీ అయ్యారు.


 సమావేశానంతరం ఉండవల్లి మాట్లాడుతూ ‘‘నేను ఏ పార్టీలో లేను. ఏ పార్టీలో చేరను. రాజీనామాలకు నేను వ్యతిరేకం. అయినా గతంలో నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లును ఆమోదించారు. నేను గతంలో రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలు, కోర్టుల్లో వేసిన పిటిషన్ల కాపీలను సీఎంకు అందజేశా’’ అని చెప్పారు.

Image result for ఉండవల్లి

చంద్రబాబుతో పలు కీలక అంశాలపై చర్చించానని చెప్పారు ఉండవల్లి. తాను రాసిన బుక్‌తో పాటూ ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలు, కోర్టులో వేసిన డాక్యుమెంట్లను సీఎంకు అందజేసినట్లు తెలిపారు. ప్రధానంగా వర్షాకాల సమావేశాల్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తానికి తెలియజేయాల్సిన భాద్యత ఉందన్నారు. 

Image result for chandrababu

ప్రధాని మోదీ కూడా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో.. ఏపీ విభజన, తదనంతర పరిణామాల గురించి మాట్లాడారని.. రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన ఆయనే.. మనకు అన్యాయం జరిగిందని ఒప్పుకున్నారన్నారు.  పార్లమెంట్‌లో ఎలా పోరాడాలో కొన్ని సూచనలు ఇచ్చానని, నిర్ణయం వారిదేనని ఉండవల్లి తెలిపారు. తానే పార్టీలో లేనని, ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన స్పష్టంచేశారు. వైకాపా ఎంపీల రాజీనామాలు సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: