ప్రత్యేక హోదా విషయం లో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీ వైఖరీ నీ అందరూ మెచ్చుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా అనే అంశం ఉందంటే దానికి కారణం జగనే అని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్ర బాబు నాయుడు ప్రత్యేక హోదా అనే అంశం ను ఎప్పుడో తొక్కి పారేశాడు. కేంద్రం తో లాలూచీ రాజికయాలు చేసి ఆంధ్ర ప్రదేశ్ కు తీరని అన్యాయం చేసాడు. అయితే జగన్ మొదటి నుంచి పోరాడి చివరిలో వదిలేసినట్లు కనిపిస్తున్నాడు. దీనితో మొదటికే మోసం వచ్చేటట్లు కనిపిస్తుంది. 

Image result for jagan

అస‌లు ప్రత్యేకహోదా కోసం మొద‌టి నుంచి ఉద్యమిస్తున్న జ‌గ‌న్ యుద్ధంలో చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చేస‌రికి ఆయుధాల‌న్నీ దుర్వినియోగం చేయ‌డం వారి రాజ‌కీయ అజ్ఞానానికి, తొంద‌ర‌పాటుకు నిద‌ర్శన‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. కేవ‌లం పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు త‌మ తాజా మాజీ ఎంపీలు నిర‌స‌న కార్యక్రమాలు చేస్తార‌ని వైసీపీ అధిష్టానం ప్రక‌టించింది. పార్లమెంట్‌లో ఉండి పోరాడేందుకు అవ‌కాశం ఉన్న ప‌ద‌వుల‌ను త్యజించి ఇప్పుడేదో చేస్తామ‌న‌డం ఏ విధంగా స‌మ‌ర్థనీయం. అటు పార్లమెంట్‌కు వెళ్లక‌, ఇటు అసెంబ్లీకి రాని వైసీపీ మ‌న‌కు అవ‌స‌ర‌మా అని సీఎం చంద్రబాబు ప్రజ‌ల్లో ఆలోచ‌న క‌లిగేలా ప్రశ్నల‌ను సంధిస్తున్నారు. దీనికి వైసీపీ ఏం స‌మాధాన‌మిస్తుంది.

Image result for jagan

జ‌గ‌న్ వైఖ‌రితో వైసీపీ శ్రేణులు సైతం సంతోషంగాలేవు. త‌మ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని టీవీ చ‌ర్చల్లో, ఇత‌ర వేదిక‌ల‌పై వైసీపీ నేత‌లు త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో స‌మ‌ర్థిస్తున్నారు. జ‌గ‌న్ ప్రారంభించిన ప్రత్యేకహోదా ఉద్యమాన్ని చంద్రబాబు నాలుగేళ్ల త‌ర్వాత అందుకుని త‌న పాల‌న‌లోని వైఫ‌ల్యాలు మ‌రుగున ప‌డేలా ఎత్తుగ‌డ వేశారు. ప్రజ‌ల్లో బీజేపీతో పాటు త‌న‌పై ఉన్న వ్యతిరేక‌త‌ను కూడా మోడీపై మ‌ళ్లించేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగ‌డ కొంతమేర స‌త్ఫలితాల‌ను ఇచ్చింద‌నే చెప్పవ‌చ్చు. అంతేకాదు రాష్ర్టానికి అన్యాయం చేసిన మోడీతో జ‌గ‌న్, ప‌వ‌న్ అంట‌కాగుతున్నార‌నే ప్రచారాన్ని ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకెళుతున్నారు. దీంతో వైసీపీ ఆత్మర‌క్షణ‌లో ప‌డింద‌నే చెప్పాలి. దీనికి ముమ్మాటికీ జ‌గ‌న్ వైఖ‌రే కార‌ణ‌మ‌ని చెప్పవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: