తిరుమల పుణ్యక్షేత్రంలో మహా సంప్రోక్షణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆగమ శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ అధికారులకు సూచించారు. పూజాది కార్యక్రమాలకు అవాంతరాలు ఏర్పడకూడదని, పరిమిత సంఖ్యలో భక్తుల దర్శనానికి ఏర్పాటు చేయాలని అన్నారు.  శ్రీవారి దర్శనం అనేది భక్తుల ముఖ్య ఉద్దేశ్యం అని..అందుకే వేల సంఖ్యలో తిరుమలకు వస్తారని..అలాంటి వారికి ఇబ్బందులు కల్పించడం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటాయని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.

Image result for మహా సంప్రోక్షణ

గతంలో మహా సంప్రోక్షణ జరిగిన సమయంలో ఎటువంటి విధానాలను పాటించారో, ఇప్పుడు కూడా అదే విధానాన్ని పాటించాలని, ఆలయంలోకి భక్తులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. తిరుమల ఆలయంలో దర్శనాల నిలిపివేత అంశంపై విమర్శలు వస్తున్న వేళ, ఈ ఉదయం అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఆయన, పరిమిత సంఖ్యలో అయినా సరే భక్తులకు స్వామి దర్శనం చేయించాలని ఆదేశించారు.
TTD
తిరుమలలో భక్తులు రోజుల తరబడి దర్శనానికి ఎదురుచూసేలా చేయవద్దని ఆయన తెలిపారు. గతంలో 1994, 2006 సంవత్సరాల్లో ఇదే క్రతువు జరిగినప్పుడు పాటించిన నిబంధనలనే ఇప్పుడూ పాటించాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.   సీఎం చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ ఈ నెల 24న అత్యవసర టీటీడీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
Image result for మహా సంప్రోక్షణ
ఈ సమావేశంలో చైర్మన్, పాలకమండలి సభ్యులు పాల్గొంటారని తెలిపారు. సమావేశం కన్నా ముందు దర్శనాల విషయంలో భక్తుల అభిప్రాయాలను తీసుకుంటామని ఆయన తెలిపారు. మహా సంప్రోక్షణ సమయంలో దర్శనాలపై విదివిధానాలను ఈ సమావేశంలో చర్చించి ప్రకటిస్తామని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారని, ఆయన ఆదేశాల ప్రకారం బోర్డు సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: