ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాంది శ్రీకాకుళం టూర్లో మొదటి దండ వేసింది ఆ ఇద్దరే. దాంతో వారు రాబోయే రోజులలో పార్టీకి షాక్ ఇస్తారా. ఏంటి అన్న చర్చ నడుస్తోంది. ఆర్భాటంగా సిక్కోలు టూర్ స్టార్ట్ చేసిన ఉమెన్ చాందీకి  ఈ ఇద్దరి నాయకుల హాజరుతో కాసింత ఉపశమనం కలిగిందనే చెప్పాలి. దాంతో రెట్టించిన ఊపుతో కాంగ్రెస్ కి మంచిరోజులన్నట్లుగా పెద్దాయన మీడియా ముందు రెచ్చిపోయారు.


టైం రాలేదా :


చాలాకాలంగా ఆ జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల తీరుపై అందరిలో అనుమానాలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి కిల్లి క్రుపారాణి, రాష్ట్ర మాజీ మంత్రి  కోండ్రు మురళి పార్టీ ఫిరాయిస్తారని టాక్ నడుస్తోంది. ఒకరు వైసీపీ, మరొకరు టీడీపీ లోకి వెళ్తా రని పత్రికలు కోడై కూస్తూ వచ్చాయి. చిత్రంగా వారిద్దరూ పెద్దాయనతో కనిపించేసరికి ఖద్దరు నాయకులకు ఏం పాలుపోలేదు. మనసు మార్చుకున్నారా, లేక టైం రాలేదా అంటూ మరో చర్చ మొదలైంది ఏ విధంగా చూసినా ఇప్పటికిపుడు మిగిలిన పార్టీలలో కూడా పొజిషన్ అంత సజావుగా లేదన్న అంచనాతోనే సర్దుకున్నారని అంటున్నారు.


వైట్ అండ్ సీ పాలసీ :


ఇప్పటికిపుడు పార్టీ నుంచి జంప్ చేసి కంపు కావడమే తప్ప ఒరిగేది లేదని ఈ నాయకులు భావిస్తున్నారని టాక్. అంతే కాదు, దేశంలోనూ, ఏపీలోనూ మారుతున్న పరిస్థితులను కూడా బేరీజు వేసుకుంటున్నారుట. ఒక వేళ రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల బీజేపీ ఓడి కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం ఏపీలోనూ ఉంటుందని, దాంతో అపుడు పార్టీలో ఉంటేనే మేలు జరుగుతుందని ముందు చూపుతో ఇటువంటి నాయకులు ఉన్నారని చెబుతున్నారు. ఏదేమైనా ఉమెన్ చాందీ కొత్త వారిని తేలేకపోయినా తన టూర్ తో పాతవారిని కొంత కాలమైన ఉంచుతున్నారని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: