తెలంగాణ రాష్ట్రానికి పర్యటనలో భాగంగా భాజాపా నేతలకు క్లాస్ పీకిన అమిత్ షా అసలెందుకొచ్చినట్లు? సీనియర్లను కాక కేవలం ఎంపిక చేసిన కొద్ది మందితో వ్యక్తిగత సమావేశాల వెనక అసలు దాగున్న ఎజెండా ఏంటి?హిందూత్వ ఎజెండా మోస్తున్న వారికే అమిత్ షా ప్రాధాన్యత ఇచ్చారా? అసలు భాజాపా పక్షంలో తెలంగాణాలో ఏం జరగబోతుంది ఎప్పుడైనా ఆలోచించారా..? భాజాపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ఒక్కరోజు పర్యటనపై రసవత్తరమైన చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనిది అమిత్  షా సొంత పార్టీ నేతలతో వ్యక్తిగత భేటీలు కావడం వెనుక అటు పార్టీలో ఇటు రాష్టంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనడంలో ఎన్నో నిజాలు దాగున్నాయి. ఇటీవల పార్టీలో చేరిన డిఎస్  తనయుడు  ధర్మపురి అరవింద్ తో భేటి కావడంపై  పార్టీలో అందరు చాలా ఆస్తకిగా  చర్చించుకుంటున్నారు.  

Image result for kcr

ఈమధ్యనే పార్టీలో చేరిన అరవింద్ కు రెడ్ కార్పెట్ వేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ కూడ కాస్త విశ్లేషపూర్వకంగానే జరుగుతోంది. అమిత్ షాతో భేటిలో అరవింద్ తండ్రి, డీఎస్ రాజకీయ భవిష్యత్తుపై చర్చించారనే ప్రచారం కూడా కొంతవరకూ పార్టీలో కొనసాగుతోంది. డీఎస్ ను పార్టీలోకి తీసుకుంటే ఎలా ఉంటుందన్న అంశం చర్చించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ తో అమిత్ షా అరగంట పాటు వ్యక్తిగతంగా భేటి కావడం పార్టీలో తీవ్ర చర్చలకు దారి తీసింది.

Image result for amith shah

పార్టీ సీనియర్ల ను బాహాటంగానే వ్యతిరేకించే రాజాసింగ్ ఈ భేటీలో వారిపై  ఫిర్యాదు చేశారనే అనుమానాలు పార్టీనేతల్లో కలుగుతున్నాయి. పార్టీ వ్యవహరాలు రాష్ట్ర పార్టీ నేతల తీరుపై పూర్తి సమాచారం తనకుందని రాజాసింగ్ ను సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీపై రాజాసింగ్ ప్రణాళికలను నేరుగ తనకే పంపాలని అమిత్ షా చెప్పినట్లు సమాచారం.  వచ్చే ఎన్నికల్లో తాను ప్రచారం చేయదలచుకున్న ప్రాంతాల లిస్టు తనకు ఇస్తే పూర్తి ఏర్పాట్లు చేస్తానని షా రాజసింగ్ కు హామి ఇచ్చారన్నది మరో కథనం.


తెలంగాణ బీజేపీలో రాజసింగ్ కరీంనగర్ బండిసంజయ్ , నిజామాబాద్ ధర్మపురి అరవింద్ లు మాత్రమే హిందు ఎజెండాతో బీజేపీలో పనిచేస్తున్న నాయకులు. వీరిలో ఇద్దరితో అమిత్ షా వ్యక్తిగతంగా భేటీ అవడం చూస్తుంటే పార్టీలో వీరికి  ప్రాధాన్యత పెరుగుతోందనే చర్చ సాగుతోంది. స్వామి పరిపూర్ణనంద వివాదంలో అందరూ ఆయనకు అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం చేయాలని షా సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. కాబట్టి బీజేపీ వచ్చే ఎన్నికల్లో హిందూత్వ ఎజెండాతోనే బరిలోకి దిగుతుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అమిత్ షా తన టూర్ లో పదిమందితో మాత్రమే వ్యక్తిగత సమావేశాలు జరిపారని వారిలో రాజాసింగ్, అరవింద్ ఉన్నారని మిగిలిన వారంతా వాణిజ్య వేత్తలేనని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కాబట్టి షా సమావేశాలకు ప్రత్యేకత ఏమీ లేదని ఆ వర్గం వాదిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: