హిందూపురం నియోజక వర్గం గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు. ఈ నియోజక వర్గం టీడీపీ కి మొదటి నుంచి కంచు కోట లాగా ఉంది. ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థులు ఇక్కడ ఓడి పోలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ నియోజక వర్గం ఎమ్మెల్యే గా బాలకృష్ణ ఉన్నాడన్న సంగతీ తెలిసిందే. ఈ నియోజక వర్గం లో ఇప్పటికే అనేక విషయాల్లో నిరసన జ్వాలలు రేగుతున్నాయి. చంద్ర బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ని తుంగలో తొక్కాడు. హిందూ పురం లో సమస్యలు పెరిగిపోతున్నాయి. 

Image result for balakrishna mla

తమకు అధికారం అప్పగిస్తే అన్ని రుణాలూ మాఫీ అని బాబు అప్పట్లో ప్రకటించేశాడు. అలా మాఫీహామీని రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేతలకు, ఇతర చేతిపనుల వారందరికీ ఇచ్చాడు చంద్రన్న. అధికారం అందీ అందగానే మాఫీ అని, ఈ విషయంలో మరో మాటేలేదని.. కుదవపెట్టిన బంగారాన్ని కూడా విడిపించేస్తామని ఈ వర్గాలందరికీ చంద్రబాబు, తెలుగుదేశం నేతలు హామీఇచ్చారు. రైతు రుణమాఫీ కేవలం నామమాత్రంగా జరిగింది. చాలామందిని అనర్హులుగా చేసేశారు. అదేమంటే వాళ్లంతా వైసీపీ వాళ్లు అని స్వయంగా చంద్రబాబు ఆరోపించాడు.

Image result for balakrishna mla

ఆపై విడతల వారీగా మాఫీ అని ఇప్పటికీ దాన్ని ఎటూకాకుండా చేసిన ఘనత చంద్రబాబుదే. ఇక డ్వాక్రా రుణమాఫీ సరేసరి. ఆ హామీనే తాము ఇవ్వలేదన్నట్టుగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్లు. ఇక ఈ వర్గాలు తీవ్రమైన అసహనంతో ఉంటే, చేనేతన్నలు ఎక్కువగా ఉండే అనంతపురం జిల్లాలోనే ఇప్పుడు నేత కార్మికులు రోడ్డుఎక్కారు. హిందూపురంలో చేనేత కార్మికులు ఎక్కువ. దానికి ఎమ్మెల్యే శ్రీమాన్ బాలయ్యబాబు అని చెప్పనక్కర్లేదు. తమకు ఇప్పటి వరకూ మాఫీ జరగలేదని చేనేత కార్మికులు బాలయ్య ఇంటిని చుట్టుముట్టారు. ఇప్పుడు బాలయ్య నియోజకవర్గంలో లేరు. సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బాలయ్య పీఏ వాళ్లందరితోనూ అర్జీలు తీసుకున్నాడట. అయితే అర్జీలు ఇవ్వడం కూడా కొత్తకాదని, తాము ఇప్పటికే చాలాసార్లు అర్జీలు పెట్టుకున్నామని అయినా ప్రయోజనం కనపడటం లేదని చేనేత కార్మికులు వాపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: