జగన్ మోహన్ రెడ్డి అతి పిన్న వయసులో స్వంత పార్టీ పెట్టి కాంగ్రెస్ నే గడ గడ లాడించిన అసాధారణ నాయకుడు అని చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో జనాదరణ నాయకుడని  అని పించుకున్నాడు. తన తండ్రి మీద చూపించిన అభిమానాన్ని జనాలు జగన్ మీద కూడా చూపించారు. అయితే 2014 లో జగన్ సీఎం పీఠం కు కొన్ని అడుగుల దూరం లో ఉండి పోయినాడు. అప్పుడు జగన్ చేసిన కొన్ని పొరపాట్లు విజయావకాశాలను దెబ్బ తీశాయని చాలా మంది అభిప్రాయం పడతారు. 

Image result for jagan

తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, 'నెలరాజు'గా పేరు పొందిన నాదెండ్ల భాస్కర్‌రావు జగన్‌పై తన అభిప్రాయం వ్యక్తంచేస్తూ, అతను ప్రజాధరణ ఉన్న నేతని అన్నారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే... జగన్‌ తన వ్యవహారశైలిని, తీరును మార్చుకుంటేనే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. జగన్‌లో ఏం లోపాలున్నాయి, ఏం మార్చుకోవాలి అనేది వివరించలేదు. దేశంలోని ఏ పాపులర్‌ నాయకుడు, ఏ పార్టీ అధినేతా పరిపూర్ణుడు కాడు. అనేక లోపాలున్నాయి.

Image result for jagan

సమయానుకూలంగా, కాలానుగుణంగా ఆ లోపాలను సరిచేసుకోవాలి. విజయానికి అనేక కారణాలు దోహదం చేసినప్పటికీ పనితీరు, వ్యక్తిత్వం కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. వైకాపా అధినేత ఎవ్వరి మాటా వినడనే అభిప్రాయం పార్టీలోనే ఉంది. సొంత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని కొందరు నాయకులు చెబుతున్నమాట. వైకాపాకు-బీజేపీకి అంతర్గతంగా లింకు ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలను జగన్‌ వ్యక్తిగతంగా బలంగా ఖండించడంలేదనే అభిప్రాయముంది. దానికి తగినట్లే ఈమధ్య కేంద్రంమంత్రి అథవాలే జగన్‌ను ఎన్‌డీఏలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి అయ్యేందుకు సాయం చేస్తామన్నాడు. దీనికీ గట్టిగా సమాధానం చెప్పలేదంటున్నారు కొందరు. ఏది ఏమైనా జగన్ లో ఈ ధోరణి మారితే అధికారం లో కి వచ్చే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: