అలుపెరగని పాదచారి జగన్ ఉత్తరాంధ్ర లోకి మరి కొద్ది రోజులలో అడుగుపెట్టనున్నారు. అధినేత రాకకు సంబంధించి పార్టీ నాయకులు పెద్దగా స్పందిస్తున్నది మాత్రం లేదు. క్యాడర్లో జోష్ ఉన్నా లీడర్లు మాత్రం అంతగా శ్రద్ధ  చూపడంలేదు. అసలు ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీ ఇలా తయారవడానికి ఈ లీడర్లే కారణం కదా. జనంలో ఆదరణ ఉన్నా క్యాష్ చేసుకోలేని అసమర్ధ నాయకత్వం ఈ జిల్లాలలో ఉంది. 


అంతా మీడియా బేబీలే :


పార్టీ ఉనికి జనంలోకి బలంగా తీసుకుపోవాలంటే స్థానిక సమస్యలపై పోరాటం చేయాలి. ఈ మూడు జిల్లాలలో బొచ్చెడు సమస్యలు ఉన్నాయి కూడా. అవి చాలవన్నట్లుగా విభజన కష్టాలు ఉండనే ఉన్నాయి. దేని మీదా నాయకులకు కనీస అవగాహన లేదు. పట్టించుకుందామన్న ధ్యాస అంత కంటే లేదు. పార్టీ లీడర్లుగా చెప్పుకుంటూ అపుడపుడు మీడియా ముందుకు వస్తే చాలనుకుంతే బాపతే ఇక్కడ ఎక్కువ.


బిజీ.. బిజినెస్ :


విశాఖలో ఉన్న నాయకులు ఎపుడూ బిజీగా ఉంటారు. వారి బిజినెస్ లలో పడి పార్టీని సైతం పక్కన పెట్టేస్తారు. ఎపుడైన పెద్ద నాయకులు వస్తే వారి పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పార్టీ సేవ పూర్తి అయిపోతుంది. ఎన్నికల టైంలో టికెట్ కోసం చూసుకోవచ్చు. మధ్యలో ఈ గోలంతా ఎందుకున్న మెట్ట వేదాంతం బాగా వంట బట్టిన నాయకత్వం ఉందిక్కడ.


ఆయనెలా సరి చేస్తారో :


ఇక్కడ రిపేర్లు చాలానే వున్నాయి. మరి గ్యారేజ్ మాత్రం లేదు. అధినేత జగన్ తనతో పాటు గ్యారేజ్ ని కూడా తెచ్చి బాగానే మరమ్మతులు చేయాల్సి ఉంది. ఉత్స విగ్రహాలు, ఉత్సవ మేళాలు, ఉత్తర కుమార నాయకత్వాలకు చెక్ చెప్పాల్సిన అవసరమైతే చాలనే ఉంది. పాదయాత్రతో జనాన్ని కదిలిస్తున్న అధినాయకుడు సొంత పార్టీ వారిని ఏ మేరకు కదిలిస్తాడో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: