పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు (బుధవారం) ప్రారంభమయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం ద్వారా ఇచ్చిన హమీలు అమలు చేయాలనే డిమాండ్‌ తో టీడీపీ  కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.  ఇదిలా ఉంటే ఈ పార్లమెంట్ సెషన్‌ లో కీలకమైన అనేక పలు బిల్లులను ఆమోదింప జేసుకోవాలని కేంద్రం భావిస్తున్న సమయమిది. 


నేటి ఉదయం టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు. ప్రశ్నోత్తరాల తర్వాత టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, తోట నర్సింహం, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ తెలిపారు.


క్రమానుగతంగా లోక్సభ రాజ్య సభల్లో జరిగిన సంఘటనల సమాహారం ఇలా ఉంది: 


*టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు తీర్మానాలను చదవి విన్పించినట్టు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
*దానికి టీడీపీ ఎంపిల తీర్మానం మాత్రమే చదివి విన్పించారని, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం చెప్పారు..
*10 రోజుల్లో అవిశ్వాస తీర్మాణంపై చర్చ ప్రవేశపెట్టే తేదీని ప్రకటిస్తామని సభాపతి సుమిత్రా మహాజన్ సభకు తెలియజేశారు. 
*బిజినెస్ రూల్స్‌ కు అనుగుణంగానే తాను అవిశ్వాస తీర్మానం పై చర్చను చేపట్టనున్నట్టు స్పీకర్ ప్రకటించారు
*టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు

no confidence motion against by central government by TDP Today కోసం చిత్ర ఫలితం

*లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాతే ఇతర కార్యక్రమాలు చేపడుతానని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
*రాజ్యసభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ప్రత్యేకహోదాపై ఎప్పుడు చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మెన్ అభిప్రాయపడ్డారు.
*తాము ఇచ్చిన డిమాండ్ల పై తక్షణమే చర్చ జరగాలని టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ పట్టుబట్టారు
*మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది 
*కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

no confidence motion against by central government by TDP Today కోసం చిత్ర ఫలితం

*రేపు కానీ, ఎల్లుండి కానీ  ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో చర్చకు సిద్దమని రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.
*లోక్‌సభలో గందరగోళం
*అవిశ్వాసంపై చర్చకు టీడీపీ డిమాండ్
*స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన
*టీడీపీ ఎంపీ ల ఆందోళన మద్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి
*ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు

no confidence motion against by central government by TDP Today కోసం చిత్ర ఫలితం

*ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ చేపట్టారు. ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎంపీలకు లోక్‌సభ సంతాపాన్ని ప్రకటించింది.
*కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రమాణం చేయించారు.
*రాజ్యసభలో కూడ కొత్తగా ఎన్నికైన ఎంపీ లతో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు


అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపేవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ కోరగా అనేక పార్టీల ఎంపీలు తీర్మానానికి మద్దతు తెలిపుతూ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ పార్టీ ఉన్నారు. దాదాపు 50 మందికి పైగా ఎంపీలు లేచి నిలబడి టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతినిస్తామని, అయితే చర్చ ఎప్పుడన్నది తర్వలోనే నిర్ణయిస్తామని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. 

no confidence motion against by central government by TDP Today కోసం చిత్ర ఫలితం

స్పీకర్ నిర్ణయంపై కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారు. పార్లమెంటులో అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పట్టించుకోకుండా టీడీపీ పెట్టిన అవిశ్వాసాన్ని తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అయితే నిబంధనల ప్రకారమే అవిశ్వాస నోటీసులపై నిర్ణయం తీసుకున్నానని స్పీకర్ స్పష్టం చేశారు.


లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదు. మరోవైపు ఎంఐఎం తరపున ఒకేఒక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలబడ్డారు. 


10 రోజుల్లోగా అవిశ్వాసంపై చర్చ చేపట్టాలన్న నిబంధనను టీఎంసీ సభ్యుడు సౌగత్ రాయ్ గుర్తు చేశారు.
 no confidence motion against by central government by TDP Today కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: