ప్రత్యేక హోదా కోసం టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. ఆ వెనువెంటనే అనుమతించేశారు బీజేపీకి చెందిన లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. తలలు లెక్కబెట్టేసరికి కాంగ్రెస్ అధినాయకులు సోనియాగాంధి, రాహుల్ గాంధి లేచి టీడీపీకి మద్దతుగా నిలబడ్డారు. ఈ విచిత్రమైన రాజకీయ ద్రుశ్యం ఈ రోజు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా  అందరికీ కనిపించింది.  అంతే కాదు, . త్రివేణీ సంగమంలా టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ తెరచాటు మైత్రి ఎంతో ఘనంగా లోకానికి తెలిసిపోయింది.


ఆనాడు అలా :


దీనికి ముందటి బడ్జెట్ సెషన్లో వైసీపీ తొలిసారి మోడీపై అవిశ్వాసం పెట్టింది. మొదట్లో నో అన్న టీడీపీ వైసీపీకి మద్దతు అంటూనే తానూ రంగంలోకి దిగింది. ఆ తరువాత డ్రామా అందరికీ తెలిసిందే. ఏకంగా పదిహేను రోజుల పాటు పార్లమెంట్ జరక్కుండా పోయింది. చివరకి అవిశ్వాసం ఊసు లేకుండానే క్లోజ్ చేసేశారు. ఆ తరువాత వైసీపీ ఎంపీలు రాజీనామా చేసేశారు.


ఇపుడేలా కుదిరిందో :


నాడు ప్రతి రోజూ సభలో గందరగోళం అంటూ అవిశ్వాస తీర్మానం పక్కన పెట్టేసిన స్పీకర్ ఇపుడు తాపీగా అందరి  తలలూ లెక్కించారు. చర్చకూ డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. మరో వైపు తాను కూడా ప్రత్యేక హోదాపై అవిశ్వాస తీర్మానం పెడతానన్న కాంగ్రెస్ ఏపీలో టీడీపీ రాజకీయ ప్రయోజనాలు కడు జాగ్రత్తగా కాపాడేందుకు తోక పార్టీకి మద్దతుగా లేచి నిలబడింది. పార్లమెంట్ సాక్షిగా ఈ రోజు జరిగిన ఈ రాజకీయాన్ని కుమ్మక్కు అని మాత్రం అనకూడదేమో


అందరి గురి ఆ పార్టీయేనా :


చూదబోతే ఏపీలో వైసీపీ మీదనే అన్ని పార్టీల గురి ఉందని అర్ధమవుతోంది. లేకపోతే వైసీపీ ఇలా తప్పుకుందో లేదో అలా టీడీపీకి అడ్వాంటేజ్ కలిగేలా బీజేపీ అవిశ్వాసానికి అనుమతించేసింది. కాంగ్రెస్ తాను సైతం అంటూ సపోర్ట్ చేస్తోంది. దీఎనికి ముందు నిన్న జరిగిన మరో ఎపిసోడ్ చూసినా బీజీపీ, టీడీపీ ఘటబంధన్ ఏంటో తెలిసిపోతుంది. వైసీపీ నుంచి ఫిరాయించిన కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకను ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పిలవడం వెనక ఆ రెండు పార్టీలూ లేవంటే నమ్మగలమా. మొత్తానికి టీడీపీ భలే గడుసైన పార్టీ అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కి ఏక కాలంలో కన్ను కొడుతూ తన వైపు తిప్పుకుంటోంది. టోటల్ సీన్లో వైసీపీ ఒంటరిగా మారిపోయింది. రేపటి ఎన్నికలలో ఇదేనేమో  ఏపీలో
కనిపించే సీన్.


మరింత సమాచారం తెలుసుకోండి: