ప్రధాని నరేంద్ర మోడీ పైనా,కేంద్రంపైనా ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈ రోజు సంచలన ఆరోపణలు చేశారు. ఎస్సార్ ఆయిల్ కుంభకోణంలో ప్రధాన మంత్రి కార్యాలయానికే నేరుగా సంబంధం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా కంపెనీతో ఎస్సార్ ఆయిల్ కంపెనీ చేసుకున్న ఒప్పందం అంతా అవినీతి పుట్ట అంటూ బాబులు పేల్చారు.  వేల కోట్లలో ఈ కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై పూర్తి వివరణ ప్రధాని కార్యాలయమివ్వాలంటూ లేఖాస్త్రం సంధించారు. 


మోడీ సమక్షంలోనే :


ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలోనే మొత్తం కుంభకోణం జరిగిందని కుటుంబరావు హాట్ కామెంట్స్ చేశారు. ఎస్సార్ కంపెనీకి అన్ని విధాలుగా అండదండలు అందించింది  కూడా కేంద్రంలోని కొందరు మంత్రులు, బీజేపీ పెద్దలంటూ అటాక్ చేశారు. ఈ ఒప్పందం టైంలో ప్రధాని చైనా  టూర్లో ఉన్నారని అంటున్న కుటుంబరావు నిజానికి ప్రధాని విదేశీ పర్యటను చేసేది ఇందుకోసమేనని ఒక్క ముక్కలో తేల్చిపారేశారు.


పార్లమెంట్లో లేవనెత్తుతాం :


ఈ విషయాన్ని తాము చూస్తూ ఊరుకోబోమని,పార్లమెంట్ లో  తమ ఎంపీల ద్వారా లేవనెత్తుతామని కుటుంబరావు అంటున్నారు. ఇప్పటికే ఈ కుంభకోణానికి సంబంధించి  రష్యాలో ఓ మంత్రిని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ అరెస్ట్ చేయించారని ఆయన చెప్పారు. ఇక్కద మాత్రం ఎస్సార్ కంపనీకి ఎటువంటి టాక్సులు లేకుండా నెత్తిన పెట్టుకుంటున్నారని కౌంటర్లేశారు. మొత్తం మీద కుటుంబరావు ఇంతవరకూ  ఏ  మచ్చలేని మోడీకి కూడా అవినీతి రొచ్చు అంటించేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: