దశాబ్దాల పాటు ముస్లిం మహిళలను ఆర్ధికంగ, సామాజికంగా పట్టి పీడిస్తున్న‘త్రిబుల్ తలాక్’ పద్దతికే తలాక్ ఇవ్వాలని తేల్చి చెప్పింది. త్రిబుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం వంటివి ముస్లిం మహిళల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంది. పై విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలోని పలు ముస్లిం మహిళా సంఘాలు కూడా సుప్రింకోర్టులో సవాలు చేసాయి.  పురుషులతో పోల్చుకుంటే ముస్లిం మహిళలు మాత్రం తమ వ్యక్తిగత హక్కులను కోల్పోతోన్నట్లు చెప్పింది కేంద్రం. అందుకనే త్రిబుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కేంద్రం సుప్రింకోర్టుకు విజ్ఞప్తి చేసింది.  

 జామియా మిల్లియా ఇస్లామియా, డీయూ, జేఎన్‌యూ సహా మూడు యూనివర్సిటీల్లో పట్టభద్రుడు... ముఫ్తీ అయాజ్ అర్షద్ ఖసామీ ఓ టీవీ డిబేట్‌లో మహిళపై దారుణంగా దాడి చేశాడు. దాంతో పోలీసులు ఎంటర్ కావడం..కథ సుఖాంతం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే... కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య హాట్ టాపిక్‌గా మారిన ‘ట్రిపుల్ తలాక్’పై నిన్న సాయంత్రం ప్రముఖ జాతీయ ఛానెల్ డిబేట్ నిర్వహించింది. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఫరా ఫైజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చ జరుగుతుండగా మాటామాటా పెరగడంతో ఫరాఫైజ్ మౌలానా ఖసామీ చెంపమీద కొట్టారు. 


దీంతో ఖాసామీ కూడా ఆమెపై చేయిచేసుకున్నారు. అయితే ఆయన ఎంతకీ వెనక్కి తగ్గకుండా ఆమెను కొడుతుండడంతో... అప్రమత్తమైన సిబ్బంది  బలవంతంగా విడిపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్టూడియోకి వచ్చి ఖసామీని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తాలూకు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆలిండియా పర్సనల్ లా బోర్డులో సభ్యుడిగా ఉన్న ఖసామీ... దారుల్ ఉలూం డియోబంద్‌లోనూ ప్రతినిధిగా పనిచేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: