ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి, బందుప్రీతి, చీకటిబజార్, కాల్మనీ, కల్తీరాజ్, గూండారాజ్ మొదలైన సమాజిక నేరాలతో విలసిల్లుతుందని, దేశంలోనే వీటిలో ప్రధమ స్థానం పొందటానికి ఉవ్విళ్ళూరుతుందనే వినిపించే మాటలకు ఇప్పటికైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానాలు ఇచ్చుకోవలసిన అవసరముందని విపక్షాలు విమర్శల కుండపోత కురిపిస్తున్నాయి. 


అవిషయాలు అబద్దమైతే ఆధారాలు చూపుతూ ఖండించి పోయేపరువును నిలుపుకోవచ్చుకదా? అంటున్నారు ప్రజలు. అలా కాకుంటే ఎన్నికల నాటికి ఇదే పెద్ద భూతమై అసలు టిడిపినే కబళించే పరిస్థితులు వస్తాయని అంటున్నారు. 

kanna questions chandrababu with 5 questions కోసం చిత్ర ఫలితం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గత కొద్దిరోజులుగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు వారాలుగా 10 ప్రశ్నలు సంధించిన కన్నా, తాజాగా మూడో వారం పలు ప్రశ్నలు సంధించారు. తాను సంధించే ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలరా? అంటూ వ్యాఖ్యానించారు.

kanna questions chandrababu with 5 questions కోసం చిత్ర ఫలితం

కన్నా లక్ష్మీనారాయణ సంధించిన తాజా సూటి ప్రశ్నలివీ..


1. సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుండి తీసుకుని, వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా దారుణంగా వంచించి, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మెజారిటీ వాటా (58%) సింగపూర్ సంస్థలకు దోచిపెట్టడం లేదా? రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్దమా?


2. మీరు అధికారంలోకి వచ్చే సమయానికి రూ.లక్ష కోట్లు ఉన్న రాష్ట్ర ఋణ భారం, ఇప్పుడు ఏకంగా రూ. 2.35లక్షల కోట్లకు ఎందుకు పెరిగిందో ప్రజలకు సంజాయిషీ ఇవ్వగలరా?  రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, రాష్ట్రానికి ద్రోహం చేస్తోన్నా మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఉందా?


3. గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోవడానికి మీ ప్రచార పిచ్చి కారణం కాదా? మీ వనం-మనం కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఐ.పోలవరంలో అమాయాక విద్యార్ధులు చనిపోవడం నిజం కాదా? మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల మరణాలకు మీరు భాద్యత వహించాల్సిన అవసరం లేదా?


4. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, అసెంబ్లీ లో కేంద్ర ప్రభుత్వానికి ధన్య వాద తీర్మానం చేయించింది మీరు కాదా? ప్యాకేజీలో భాగంగా నిధులు తీసుకుంటూనే, ప్రత్యేక హోదా  కావాలనడం దుర్మార్గం కాదా? ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసింది మీరు కాదా?


5. పారదర్శక పాలన అందిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకునే మీరు అత్యధిక సంఖ్యలో రహస్య జీఓలను జారీ చేసిన విషయం నిజం కాదా? అసలు రహస్య జీఓలను విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందీ? ఇవన్నీ అవినీతి కోసం కాదా?


కాగా.. ఈ ఐదు ప్రశ్నలకు ముందు రెండు వారాలపాటు సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా టీడీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే కన్నా ప్రశ్నలకు సీఎం దగ్గరే సమాధానమే లేదనా?  లేకుంటే కన్నా చెబుతున్న మాటలన్నీ అక్షర సత్యాలేనా? ఈ విషయానికి సీఎం స్పందించి తీరాల్సిందే నని అంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

kanna questions chandrababu with 5 questions కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: