టీడీపీ బీజేపీ నుంచి విడిపోయిన తరువాత బీజేపీ మీద టీడీపీ మాటల దాడిని పెంచారు. ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేసిందని అందులో తమ తప్పేమి లేదని చెప్పే ప్రయత్నం టీడీపీ నాయకులూ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక పక్క వైసిపీ , బీజేపీ కుమ్మక్కయిందని విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పడూ పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీ , బీజేపీ మరలా కలిసి పోయిందని సందేహాలు రాక మానదు. 

Image result for tdp and bjp

కేంద్రంలో ఎన్డీఏ స‌ర్కార్ పై టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నట్టు స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్ అన్నారు. అవిశ్వాస తీర్మాన నోటీస్‌ను కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన‌ప్పటికీ స్పీక‌ర్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ ప‌క్షనేత మ‌ల్లికార్జన‌ఖ‌ర్గే స్పీక‌ర్ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టారు. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిప‌క్షమైన త‌మ పార్టీ ఇచ్చిన నోటీస్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డంలో ఆంతర్యం ఏంట‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

Image result for tdp and bjp

 టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మాన నోటీసుల‌ను స్పీక‌ర్ కు ఇచ్చాయి. అయితే టీడీపీ నోటీసును మాత్రమే ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నట్టు స్పీక‌ర్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవ‌హారంలో టీడీపీ, బీజేపీ మ‌ధ్య లోపాయికారి ఒప్పందం ఉంద‌నే విమ‌ర్శల‌కు బ‌లం చేకూరుతోంది. మొద‌టి నుంచి ప్రత్యేకహోదా కోసం పోరాడుతూ మొట్టమొద‌ట వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసును  ప‌రిగ‌ణ‌లోకి ఎందుకు తీసుకోలేదో బీజేపీ నేత‌లు స‌మాధానం చెప్పాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: