విశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  అడ్డంగా బుక్ అయ్యారు. తన నియోజకవర్గంలోని ఆనందపురం మండలం తాసీల్దార్ పై ఇష్టం వచ్చినట్లు తిట్టేసిన విషయంపై జిల్లా రెవిన్యూ వర్గాలు మంత్రిపై మండిపడుతున్నాయి. నోటి దురుసుతనంతో మండల స్థాయిలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పైనే ఇలా విరుచుకుపడడం ఏంటని  ఫైర్ అవుతున్నాయి. మంత్రి ఇలాకాలో అధికారులకు రక్షణ ఏదని ప్రశ్నిస్తున్నాయి. దీనిపైన అమీ తుమీకి రెడీ అయ్యాయి.


ఇంటికి పిలిపించి మరీ :


తాజాగా జరిగిన ఈ సంఘటనలో మంత్రి గంటా ఆ తాసీల్దార్ ని తన ఇంటికి పిలిపించి మరీ బూతు పురాణం లంకించుకున్నారట. నేను చెప్పినట్లే చేయాలి, నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదంటూ అసభ్య పదజాలంతో దూషించేసరికి సదరు అధికారికి నోట  మాట రాలేదు సరి కదా బిక్క చచ్చిపోయాడు. గంటా కొలువుకే సలామంటూ బెంబేలెత్తిపోయాడు.


భూ దందాను సపోర్ట్ చేయలెదనే :


మంత్రి అనుచరులు ఆనందపురం మండలంలో సాగిస్తున్న భూ దందాను తాసీల్దార్ సపొర్ట్ చేయలేదన్న అక్కసుతోనే గంటా ఇలా రెచ్చిపోయారని టాక్. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకుని ఆ భూములను కాపాడినండుకు మంత్రి అధికారికి ఇచ్చిన బహుమానం ఈ తిట్ల పురాణం. అంతే కాదు, ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు కూడా నష్ట పరిహారం ఇమ్మన్న పసుపు తమ్ముళ్ళ మాటను ఆ అధికారి పెడ చెవిన పెట్టి రూల్స్ కి కట్టుబడి ఉండడం మంత్రి గారికి అసలు నచ్చలేదు.


ఒక్కటైన రెవిన్యూ అధికారులు :


పధ్ధతి  ప్రకారం పోతున్న తాసీల్దార్ మీద నోటికొచ్చినట్లు మాట్లాడీ మంత్రి గంటా వ్యవహారం జిల్లాలో సీరియస్ ఇష్యూగా మారుతోంది. నేను చెప్పినట్లు చేయకపోతే సెలవ్ పెట్టి దొబ్బెయ్ అంటూ మంత్రి పరుషంగా మాట్లాడడాన్ని రెవిన్యూ అధికారులు గట్టిగానే తీసుకున్నారు. దీనిపై సీఎస్ ద్రుష్టికి తీసుకురావడమే కాదు, ఏకంగా సీఎం బాబుకు కూడా ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. గంటాకు ఇపుడు కొత్త తలనొప్పి మొదలైందన్న  మాటే.


మరింత సమాచారం తెలుసుకోండి: