ఏపీలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. రేపటి ఎన్నికలలో జనం ఓడించాల్సింది ఆ పార్టీనైతే, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని చిత్తుగా ఓడించాలంటున్నారు ఉమెన్ చాందీ.  విశాఖలో కాంగ్రెస్ కార్యకర్తల మీటింగులో ఈ రోజు ఆయన ఇలా పిలుపు ఇచ్చి  అక్కడున్న అందరికీ షాక్ ఇచ్చారు.  ఆయన గారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా వచ్చిన తరువాత కాంగ్రెస్ రూటే మార్చేశారు. అటు ఇటూ తిప్పి వైసీపీ మీదనే విమర్శలు చేయడం ఉమెన్ చాందీ స్టైల్ అయిపోయింది. నిజానికి ఏపీలో పవర్ ఎంజాయ్ చేస్తోంది టీడీపీ అన్న సంగతి తెలిసి కూడా వైసీపీని కేరళా పెద్దాయన టార్గెట్ చేశారూ అంటే ఇందులో పెద్ద వ్యూహమే ఉందంటున్నారు.


వైసీపీకి  ఒట్లేస్తే దండుగట :


ఏపీలో వైసీపీకి ఓట్లు వేస్తే దండుగని, ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళరంటూ పొలిటికల్ పంచులేశారు చాందీ. అచ్చంగా టీడీపీ వాయిస్ కూడా ఇదే కదా. ఈ మధ్య వారూ అవే అంటున్నారు. ప్రజా సమస్యలు ప్రతిపక్షానికి పట్టడం లేదట. అందుకే వారిని ఎన్నుకోవద్దు అంటూ జనాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు చాందీ గారు. వీళ్ళను వద్దూ అంటే టీడీపీని మళ్ళీ నెత్తికెక్కించుకోమనే కదా ఆయన గారు చెప్పేది. . సో లాజిక్ వెరీ సింపిల్. ఆ ఇద్దరూ ఒకటయ్యారు అనడానికి చాందీ చేసిన కామెంట్లే అచ్చమైన ఉదాహరణ.


మీడియామీద ఫైర్ :


మేము మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూంటే వైసీపీ, టీడీపీ అంటారేంటంటున్నారు మీడియా మీదా ఫైర్ అయ్యారు చాందీ గారు. ఆ రెండు పార్టీలు ఎపుడూ హోదా కోసం అడగలేదుట. కాంగ్రెస్ మాత్రమే ఎన్నికలు అయిన రెండవ రోజు నుంచే ఫైట్ చేస్తోందట. ఇది జనం నమ్మాలట. తాము ప్రజలతో మమేకం అవుతున్నా ఏపీలో ఒక్క మీడియాకు పట్టడం లేదని కూడా పెద్దాయన వాపోయారు. మేం అంటరానివారమైపోయామని తెగ ఫీల్ అయిపోతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: