ఏపీలో కాంగ్రెస్ బలంగా ఉందిట. నాయకులు పోయారు తప్ప కార్యకర్తలు కానే కాదట. పోయిన లీడర్లు కూడా వెనక్కు వచ్చేస్తున్నారట. ఇదీ ఏపీలో అడుగు పెట్టిన దగ్గర నుంచీ ఉమెన్ చాందీ గారు  చెప్పే సోది. మొదట దక్షిణ కోస్తా టూర్ చేసిన చాందీ ఇపుడు ఉత్తరాంధ్ర టూర్ పట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలలో గత  నాలుగు రోజులుగా తిరుగుతున్నా పుంజీడు మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తప్ప ఎక్కడా పెద్ద నాయకుడే కనిపించడంలేదు. మీడియా మీటింగులు తప్ప ఉమెన్ చాందీ గారి మొర వినే నాఢుడే లేడు. 


పట్టించుకోని మాజీలు :


కాంగ్రెస్ లోకి మళ్ళీ రండి, చేరండంటూ ఉమెన్ చాందీ మహాశయులు ఈ జిల్లాలలో పిలుపు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు సరికదా అంత సీరియస్ గా కూడా తీసుకోలేదు. ఏ పార్టీలో చేరని సబ్బం హరి, కొణతాల రామక్రిష్ణ లాంటి వాళ్ళు ఈ వైపుగా కూడా చూడలేదు. అది చాలదా ఏపీలో కాంగ్రెస్ ఏం పీకలేదని చెప్పడానికి. అయినా చాందీ గారు మభ్య పెట్టే మాటలు చెబుతూ ఏపీలో బలంగా ఉన్నాం, రేపో మాపో అధికారం మాదే అన్నట్లుగా బిల్డప్పులు ఇస్తున్నారు. 


మరిన్ని షాకులు ఖాయం :


ఈ మూడు జిల్లాలలో ఉమెన్ చాందీ టూర్లో పక్కనున్న కాంగ్రెస్ నాయకులే రేపు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి. నిజానికి వారు కూడా చాందీ మాటలు నమ్మి ఏపీలో ఏదో జరిగిపోతుందని భావించిన వారే. తీరా పెద్దాయన మీటింగ్ పెడితే పట్టుమని పది మంది కార్యకర్తలు కూడా ఎక్కడా హాజరు కాకపోవడంతో ఉన్న వారు కూడ వెళ్ళిపోయేందుకు డిసైడ్ అయిపోయారు. ఈ రోజు విశాఖలో ఆరు నియోజక వర్గాల కార్యకర్తల మీటింగ్ ఓ మోస్తరు హాళ్ళో పెడితే సగం మాత్రమే హాజరు కనిపించింది.

దీనిని బట్టీ చూస్తే కాంగ్రెస్ క్యాడర్ పూర్తిగా చెల్లా చెదురైందన్నది చాందీతో పాటు అక్కడున్న అందరికీ అర్ధమైపోయింది. ఆ అసహనంతోనే చాందీ వైసీపీ మీదా కౌంటర్లేశారంటున్నారు. మొత్తానికి ఈ రోజుతో ఉత్తరాంధ్ర టూర్ ముగించుకున్న చాందీ గారు రాహుల్ గాంధీకి చేదు వార్తే మోసుకెళ్తున్నారన్నది నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: