చంద్ర బాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రతి పక్ష నేత.  అయితే జగన్ స్పీచ్ లలో సాధారణంగా చంద్ర బాబు ను విమర్శిస్తాడు. అయితే ఇప్పడూ పొగిడినాడని చెప్పాలి. పొగడటం లో కూడా చాలా రకాలు ఉంటాయి కాబట్టి వెటకారంగా పొగిడినాడని చెప్పాలి. చంద్ర బాబు నాయుడు నెంబర్ వన్ అని ఒప్పుకున్నాడు. అయితే చంద్ర బాబు ఎలా నెంబర్ వన్ అయ్యాడో జగన్ మాటల్లో విందాము..!

Image result for jagan and chandrababu naidu

ఆరోగ్య శ్రీ లాంటి గొప్ప పథకాన్ని నీరుగార్చడంలో చంద్రబాబు నంబర్ వన్. ఎన్నో కాలేజీలు మూతపడేలా చేసి, విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేయడంలో చంద్రబాబు నంబర్ వన్. దోచుకున్న నల్లధనాన్ని విదేశాల్లో దాచుకోవడానికి వెళ్తూ, అనుకూల మీడియాతో ఆ పర్యటన ప్రజల అభివృద్ధి కోసమని చెప్పించుకోవడంలో బాబు నంబర్ వన్." ఇలా చంద్రబాబు ఏఏ అంశాల్లో నంబర్ వన్ గా కొనసాగుతున్నారో జగన్ వివరించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కాకినాడలో పాదయాత్ర చేసిన జగన్, భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబుపై ఈ వ్యాఖ్యలు చేశారు. చివరికి ప్రత్యేకహోదా విషయంలో కూడా చంద్రబాబును నంబర్ వన్ ను చేశారు జగన్.

Image result for jagan and chandrababu naidu

"ప్రత్యేకహోదా కోసమే బీజేపీతో పొత్తు ఉన్నారు బాబు. ఆ తర్వాత ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా అన్నారు. ప్రత్యేకహోదా మాటెత్తితే జైళ్లో పెడతామన్నారు. ప్రత్యేకహోదా ఎందుకు ప్యాకేజీ ఉందిగా అన్నారు. ఇప్పుడేమో సరిగ్గా ఎన్నికల ముందు ప్రత్యేకహోదా కావాలంటున్నారు. ఇలా రోజుకోమాట మార్చడంలో చంద్రబాబు నంబర్ వన్." అని జగన్ చంద్ర బాబు ను తనదైన శైలిలో పొగిడి విమర్షించినాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: