Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 7:46 am IST

Menu &Sections

Search

లెక్క తప్పుతున్న టిడిపి అవిశ్వాసం - 'బాబు మోడీని ఢీకొట్టాడు' అనిపించుకోవటానికెనా?

లెక్క తప్పుతున్న టిడిపి అవిశ్వాసం - 'బాబు మోడీని ఢీకొట్టాడు' అనిపించుకోవటానికెనా?
లెక్క తప్పుతున్న టిడిపి అవిశ్వాసం - 'బాబు మోడీని ఢీకొట్టాడు' అనిపించుకోవటానికెనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే ఆలోచన తమకు లేదని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు చెబుతున్నారు.తమ ఓట్లతో ప్రభుత్వం పడి పోవడం నిలబడటం ఉండదు కాబట్టి తమ ప్రయత్నం "చంద్రబాబు నాయుడు మోడీని ఢీకొట్టాడు" అని అనిపించు కోవటానికేనని అంటున్నారు. 

ap-news-national-news-no-confidence-motion-for-nam

అలాంటప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు? 

పార్లమెంటును తో పరాచికాలా? 

ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చ ఎందుకు? 

అని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక టీడీపీ ఎంపీ ప్రశ్నిస్తున్నాడు.  అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడాల్సిన బీజేపీ వాళ్లు నిశ్శబ్ధంగా తమ పనులు చక్కదిద్దు కుంటూ ఈ అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోదని, తెలుగు దేశం పార్టీ ఓట్లతో తమకు వెంట్రుక వాసి నష్టం కూడా లేదని బీజేపీ వాళ్లు ధీమా వ్యక్తం చేయాల్సి ఉండగా, విచిత్రంగా అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో పెడుతున్న వాళ్లే, ఇది దాదాపు ఉత్తుత్తి కార్యక్రమమే" అని చెబుతున్నారు.

ఇంత దిక్కుమాలిన కార్యక్రమం టిడిపి తప్ప మరెవరైనా చేయగలరా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.  తమ అవిశ్వాసం తీర్మానం నరెంద్రమోడీ ప్రభుత్వాన్ని పడ గొట్టే లక్ష్యంతో చేసేది కాదని, అసలు కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం కూడా తమకు లేదని, అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో పాల్గొనాల్సిన అవసరం లేదని కూడా టీడీపీ ఎంపీలే బల్లగుద్ది చెబుతున్నారు. 

మరోవైపు, టిడిపి అనుకూల కుల మీడియా మాత్రం  టిడిపి ఎంపిలు  అన్ని పార్టీల తోనూ చర్చలు జరుపుతున్నారని లీకుల మీద లీకులు ఇస్తోంది, బహుశ జనం లో తెలుగుదేశం ప్రభుత్వం పరువు నిలబెట్టటానికి కావచ్చని విఙ్జులు అంటున్నారు. పార్టీ పలుచన కాకుండా సపోర్ట్ గుంజలు వేస్తున్నట్లుంది. 
అంటే రాజుకు లేని, రాజుకు చేత గాని రాజభక్తి ప్రదర్శించటం ఆ మీడియాకే చెల్లిందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. 


 ap-news-national-news-no-confidence-motion-for-nam

అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు. నిజానికి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరంలేదు. నరెంద్రమోడీకి వ్యతిరేకంగా ఎవరు నిలిచినా వాళ్ళకై  వాళ్లే కలిసి వస్తారు. చంద్రబాబు వాళ్లతో మాట్లాడుతున్నాడట, టీడీపీ ఎంపీలు వాళ్లతో సమావేశం అవుతున్నారట!


స్వంత పార్టీ వాళ్ళే కారణాలేవైనా కలిసిరావటం లేదు

ap-news-national-news-no-confidence-motion-for-nam

కేంద్ర ప్రభుత్వంపై  అవిశ్వాసం సందర్భంగా జరిగే చర్చలో నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్పీవై రె్డ్డి  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు అదీ తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్న దరిమిలా అయినా హాజరౌతారా? లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఎస్పీవై రెడ్డి ఆరోగ్యపరిస్థితుల దృష్ట్యా పార్టీ నాయకత్వం కూడ ఈ విషయంలో ఆయన పై పెద్దగా ఒత్తిడి తీసుకురాకపోవచ్చనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. 


నంద్యాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే  ఆయన వీల్‌-ఛైర్‌ కే పరిమితం కావాల్సివచ్చింది. ఆ తర్వాత కూడ ఆయన పెద్దగా ఎక్కడ కూడ ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న చాయలు లేవనే చెప్పాలి.  ఎస్పీవై రెడ్డి ఇంకా నంద్యాలలోనే ఉన్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు పార్టీ నుండి మినహయింపులు లభించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. 

ap-news-national-news-no-confidence-motion-for-nam
ఇప్పటికే  తాను పార్లమెంట్‌కు హజరయ్యేది లేదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిర్ద్వంధంగా చాలా ఘాటుగానే ప్రకటించారు. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ  తాను పార్లమెంట్‌ కు హాజరుకానని  ఆయన ప్రకటించటం పట్ల టీడీపీ నాయకత్వం తీవ్ర అసంతృప్తి తో ఉంది. తన వ్యక్తి గత డిమాండ్ల సాధన కోసం జేసీ దివాకర్ రెడ్డి ఈ సమ యాన్నే అనువుగా ఎంచు కొని పార్టీ నాయకత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో పార్టీ సీనియర్లు కొందరు జేసీ తీరును తప్పుబడుతున్నారు. 

మరోవైపు తమ ప్రయత్నాలు ఫలించి జేసీ దివాకర రెడ్డి వ్యవహారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  జేసీ దివాకర రెడ్డి డిమాండ్లు టిడిపి నెరవేరిస్తే ఆయన ఢిల్లీకి వెళ్లే  అవకాశం  ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

ఇదిలా ఉంటే ఎస్పీవై రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో విజయం సాధించినా, ఆ  తర్వాత టీడీపీలో చేరారు. అయితే ఎస్పీవై రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ స్పీకర్‌ కు ఫిర్యాదు చేసింది. కానీ, ఇంతవరకు ఈ విషయమై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.   

దేశ వ్యాప్తంగా బీజేపీ యేతర పార్టీలను కూడగడుతున్న టీడీపీకి స్వంతపార్టీ ఎంపీల కారణం గానే తలనొప్పులు వస్తున్నాయి. ఇలాంటి కీలక సమయం లో జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరం పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే  ఎస్పీవై రెడ్డి  పార్లమెంట్‌ కు హాజరౌతారా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు.దీంతో అవిశ్వాసానికి అనుకూలంగా  తమకు  ఓట్లు వస్తాయని  టీడీపీ నేతలు వేసిన  లెక్కలు  తప్పుతున్నాయి.
ap-news-national-news-no-confidence-motion-for-nam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఖర్చు తడిసి మోపెడు - ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
కేరళ పోలీసులు ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు చేసిన అన్యాయానికి సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు
టిఆరెస్ గెలిస్తే రాష్ట్రం రావణ కాష్టమే - రజాకార్ల పాలనే!: అమిత్ షా
About the author