చంద్రబాబు మంచోడు, సత్య హరిశ్చంద్రుడు, ఆయనను మించిన వాళ్ళు ఏపీకి లేనే లేరు. మాజీ ఎంపీ సబ్బం హరి వీలు దొరికినపుడల్లా చెప్పే హరి కధ ఇది. తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చంద్రబాబుకు బాకాగా మారిన ఆయన ఈ రోజు డిల్లీలో మరో మారు బాబును పొగిడేశారు. అదే నోటితో మోడీని వెక్కిరించేశారు. ప్రత్యేక హోదా రాకపోవదానికి బాబు కారణం కానే కాదని ఓ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు ఏపీ ప్రజలను బాబు మోసం చేయలెదని, మోదీ మాత్రమే చేశారంటూ తనదైన స్టోరీ చెప్పారు.


గెలిచే పార్టీలో పోటీ :


అన్నీ తెలిసేలా చేస్తూనే సస్పెన్స్ అని చెప్పడం హరికే చెల్లింది. రేపు టీడీపీ పెట్టిన అవిశ్వాసం పై పార్లమెంట్లో  చర్చ. టీడీపీసీనియర్లంతా అక్కడే ఉన్నారు. పనిగట్టుకుని హరి కూడా వెళ్ళారంటేనే ఆ పార్టీ అనధికార సభ్యుడని  తెలిసిపోతోంది. ఇక మీట్ ది ప్రెస్ లో హరి చంద్రబాబుని వెనకేసుకురావడం, పవన్, జగన్ లపై కామెంట్స్ చేయడం అంతా ఓ ప్లాన్ ప్రకారమే అని చెప్పనవసరం లేదు. బాబు మంచోడు
అంటూనే చేరబోయే పార్టీ చెప్పను అంటున్నారు హరి. ఆయన చెప్పకపోయినా అడుగులు ఎటు పడుతున్నాయో తెలియదా ఆ మాత్రం.


ఎన్నికల ముందు ఎన్నో పరిణామాలు :


ఈ మాజీ ఎంపీ గారు ఏపీలో ఎన్నికల ముందు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. పవన్ బీజేపీ కలవచ్చుట, అలాగే పవన్, జగన్ పొత్తులు పెట్టుకోవచ్చుట. ఆ పరిణామాలు ఏపీలో కీలకమైన మార్పులను తీసుకువస్తాయట. మరి ఈ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.  ఇదంతా బాగానే ఉంది కానీ ఆయన చేరే పార్టీ, ఆయన గెలుస్తారా అదీ చెబితే బాగుంటుందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: