తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని తెగ ఊదరగొడుతుంటారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు. ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సారథ్యంలో అన్ని పనులు జరుగుతాయని ఆయనకు తెలియకుండా ఎటువంటి విషయం ముందుకు కదలదని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారు. అయితే ఇంతకీ లోన జరుగుతున్న పరిస్థితులు చూస్తే టిడిపి నాయకులు చేసిన కామెంట్లు అబద్ధాలే అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

Image result for yanamala

పార్టీలో ఎవరికి తోచింది వాళ్ళు చేస్తుంటారని , ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బాబు చెయ్యాల్సిన పనులు కూడా పార్టీ నేతలు చేస్తుంటారని అంటున్నారు. తాజాగా చంద్రబాబు సన్నిహితుడు పార్టీ లో సీనియర్ అనే పేరున్న యనమల రామకృష్ణుడు కొత్త ప్రకటన చేశారు . జిల్లాలో అభ్యర్థులను ప్రకటించి కలకలం సృష్టించారు. ఇటీవల ఆర్థికమంత్రి యనమల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో రాబోయే ఎన్నికల ఎమ్మెల్యే క్యాండెట్ ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశారు.

Image result for yanamala chandrababu

యనమల మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యే గా పెందుర్తి వెంకటేష్ ను తిరిగి గెలిపించుకోవలసిన బాధ్యత అందరి మీద ఉన్నదంటూ జనానికి సందేశం ఇచ్చారు . తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ల అందరికీ మళ్ళీ సీట్లు ఖరారే అంటూ హామీలిచ్చారు. దీనితో పార్టీ లో చంద్రబాబు తీసుకోవలసిన నిర్ణయం మంత్రులు వెల్లడిస్తుండడం చర్చియనాంశమయింది.

Image result for chandrababu

మరోపక్క వచ్చే ఎన్నికల్లో సదరు సీటు కోసం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులు యనమల ప్రకటన విని చంద్రబాబుపై టిడిపిపై వారిలో వారు తీవ్ర విమర్శలు చేశారట. దీంతో ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు మంత్రి యనమల పై గుర్రుగా ఉన్నారట...నాకు చెప్పకుండా ఎన్నికల ముందు అభ్యర్థులను ఎవరు ప్రకటించమన్నారని తన దగ్గర ఉన్న ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారట చంద్రబాబు.




మరింత సమాచారం తెలుసుకోండి: