గత నాలుగు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో మిత్ర పక్షం వహించి రాష్ట్రానికి మోడీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిధులు సమకూర్చారు అంటూ చంద్రబాబు చాలా సందర్భాలలో కేంద్రప్రభుత్వాన్ని భుజాన వేసుకుని మరి పొగిడారు. అంతెందుకు ఆనాడు అమరావతి సాక్షిగా మోడీ వచ్చిన సందర్భంలో చంద్రబాబు చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ గుర్తు వుంది.

Image result for chandrababu

ఆ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ నష్టపోయిన రాష్ట్రానికి ఇప్పటికే చాలా చేశారు మీరు రాష్ట్రానికి చేసిన మీ సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు అని అన్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ యే రాష్ట్రానికి మంచిదని చంద్రబాబు అన్న విషయాలు ప్రజలందరికీ గుర్తుండే ఉన్నాయి.

Image result for chandrababu kcr

అయితే తాజాగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలందరూ ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని బలంగా నమ్ముతున్నడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకుని...రాష్ట్ర ప్రజల ముందు బీజేపీ పార్టీని దోషిగా నిలబెట్టే కార్యక్రమాలకు పూనుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపద్యంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి రాజకీయలబ్ధి పొందాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు పార్లమెంటు సాక్షిగా.

Image result for kcr

ఈ క్రమంలో పార్లమెంటులో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడానికి వివిధ పార్టీలతో చంద్రబాబు మంతనాలు జరిపారు. ఇదిలావుండగా బిజెపి ప్రభుత్వం పై చంద్ర‌బాబు పెట్టిన అవిశ్వాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డం వెనుక తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే ప్ర‌ధాన అంశ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: