చంద్ర బాబు నాయుడు తన అవసరాల తగట్టు మనుషులను వాడుకొని వదిలేయడం కొత్తేమి కాదు. అలాగే పార్టీ వ్యక్తులైన వారిని అవమానించడం బాబు కి కొత్తేమి కాదు. అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాడు చంద్ర బాబు ఆదేశం తో...  కానీ ఏం లాభం మాట్లాడే అవకాశం మాత్రం గల్లా జయదేవ్ కు ఇచ్చినాడు. దీనితో కేశినేని నాని కీ సహజంగానే అవమానం జరిగినట్టే..!

Image result for kesineni nani

 రాష్ర్టానికి జ‌రిగిన అన్యాయంపై త‌మ ఎంపీ పార్లమెంట్ వేదిక‌గా గ‌ళం విప్పుతార‌ని ఎదురు చూస్తున్న విజ‌య‌వాడ పార్లమెంట్ ప‌రిధిలోని ప్రజ‌ల‌కు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయం తీవ్ర ఆగ్రహాన్ని, నిస్పృహ‌ను క‌ల‌గ‌జేసింది. కేశినేనికి బ‌దులు గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌తో చ‌ర్చను ప్రారంభించాల‌ని చంద్రబాబు నిర్ణయించ‌డం అంటే కేశినేనిని అవ‌మానించ‌డ‌మే అని ఆవేద‌న చెందుతున్నారు.

Image result for kesineni nani

గ‌ల్లా జ‌య‌దేవ్ విదేశాల్లోకి చ‌దువుకున్నాడ‌ని, గ‌త బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఆవేశంగా మాట్లాడి అంద‌రి దృష్టి ఆక‌ర్షించార‌నే ఉద్దేశంతో ఆయ‌న‌కు అవ‌కాశం క‌ల్పించి ఉండొచ్చని, అయితే కేశినేని కూడా ఊటీ స్కూల్లో చ‌దువుకున్నార‌ని, ఆయ‌న‌కు ఆంగ్లంపై మంచిప‌ట్టు ఉంద‌ని, విష‌యాన్ని మంచిగా ప్రజెంట్ చేసే నైపుణ్యం ఉంద‌ని ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు. ఇప్పుడు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా, వ్యూహాత్మకం పేరుతో కేశినేని నానికి వ‌చ్చిన సువ‌ర్ణ అవ‌కాశాన్ని కొల్లగొట్టడం ఏంట‌ని వారు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నిర్ణయం వ‌ల్ల కేశినేనికి ఇంగ్లిష్ మాట్లాడ‌టం రాద‌ని, దేశ ప‌రిస్థితుల‌పై, రాష్ర్టానికి కేంద్రం చేసిన అన్యాయంపై అవ‌గాహ‌న లేద‌నే సంకేతాన్ని పంపుతోంద‌ని వాపోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: