కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉందని, రేపటి రోజున ఏపీలోనూ కీలకమైన పాత్ర పోషిస్తామంటూ ఆ పార్టీ ఏపీ వ్యవహారాలా ఇంచార్జ్ ఉమెన్ చాదీ ఓ వైపు చెబుతూనే ఉన్నారు. మరో వైపు నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇపుడు విశాఖ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వంతు వచ్చింది. రేపో మాపో దుకాణం సర్దేసి జనసేనలోకి జంప్ చేయడానికి ఆయన గారు  రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రాయబేరాలు జరుగుతున్నాయట.


హస్తవ్యస్తం అయిందనే :


వచ్చే ఎన్నికలలో ఎలాగైనా  ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ బెహరా భాస్కర రావు గట్టిగా ఆలోచిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకోకపోవడంతో ఆ పార్టీ నుంచి పోటీ అంటే నో చెబుతున్నారట. నిజానికి 2014లోనే ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కానీ పోటీ చేయలేదు. ఇపుడు చూసుకున్నాకాంగ్రెస్  కధ అలాగే ఉంది కాబట్టి ఆయన చూపు ఇతర పార్టీలపైన పడిందట.


పడమరలో ఉదయించాలనీ :


విశాఖ పశ్చిమ సీటును ఆయన ఆశిస్తున్నారు. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గణబాబు ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే,  సిటీ ప్రెసిడెంట్ మళ్ళ విజయప్రసాద్ పోటీకి దిగుతారు. సో మిగిలింది జనసేన మాత్రమే. కొత్తగా వచ్చినా ఆ పార్టీకి ఇక్కడ సరైన క్యాండిడేట్ లేరు. దాంతో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కన్ను ఆ పార్టీపై పడిందట. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చాలా మంది మిత్రులు జనసేనలో చేరిపోయారు. వారి ద్వారా పవన్ తో ఆయన రాయబేరాలు నడుపుతున్నట్లు టాక్. సీట్ ఇచ్చేందు ఓకే అంటే జంప్ చేసేందుకు ఈయన రెడీట. 


మరింత సమాచారం తెలుసుకోండి: