గడచిన నాలుగు నెలలుగా ఏదో చేసేస్తామని, తమ దెబ్బకు డిల్లీ గడగడలాడుతుందని డప్పు కొట్టిన టీడీపీ తీరా అసలు రోజు వచ్చేసరికి చతికిలపడిపోయింది. ఏ మాత్రం అనుభవం లేని, పెద్దగా ఉపన్యాసకుడు కాని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గతీ, గమ్యం లేని స్పీచ్ తో హోదా ఆశ సోదిలోకి లేకుండా పోయింది. సీరియస్ ఇష్యూని కామెడీగా మార్చేసి సినిమా స్టోరీలు, పాత వ్యధలు చెప్పి అసలు విషయాన్ని గల్లా పక్కన పెట్టేశారు. విభజన వూసులు ఇపుడెందుకన్న ఆలోచన కూడా లేకపోయింది టీడీపీ వ్యూహకర్తలకు. నిజానికి ఆ విభజనలో తమ పాపమూ ఉందని మరచిపోవడమే దారుణం. ఆ విధంగా మాట్లాడి తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణా మద్దతును పోగొట్టేసుకున్నారు. 


ఆ పార్టీల రూట్ వేరు :


నిజానికి ప్రత్యేక హోదా అన్నది ఏపీకి మాత్రమే సంబంధించిన బాధ. అయితే ఈ విషయంలో అందరినీ కలుపుకునిపోయామని ఇంతవరకూ టీడీపీ చెబుతూ వచ్చింది. కానీ పార్లమెంట్లో డిబేట్ చూస్తే ఏ పార్టీ గొడవ ఆ పార్టీది అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి టార్గెట్ వేరు. జాతీయ అంశాలే అక్కడ ప్రస్తావనకు వచ్చాయి. మిగిలిన పార్టీల తీరూ ఇలాగే ఉంది. ఎవరికి వారే అన్నట్లుగా సొంత అజెండాలు బయటకు తీసారు తప్ప హోదా అంశం అనుకున్నంతగా ఎక్కడా హైలెట్ కాలేకపోయింది.


అసలుకే ఎసరు :


నిజానికి ప్రత్యేక హోదా లాంటి వాటిని ఇలా రచ్చకు ఈడ్చితే జరిగేదేం ఉండదు. కానీ పరిస్థితి ఇంతవరకూ వచ్చేసింది. ఉన్నంతలో స్మూత్ గా డీల్ చేసుకుని ఇతర పార్టీలను కూడా కలుపుకుని పోవాల్సి ఉండగా టీడీపీ మాత్రం వ్యూహాత్మకంగా ఫైల్ అయింది. దాంతో సాటి తెలుగు రాష్ట్రమే అడ్డుకునే పరిస్థితి వచ్చింది. మరో వైపు బీహర్ వంటి రాష్ట్రాలు హోదా కోరుతున్న నేపధ్యం ఉంది. అందువల్ల జాతీయ స్థాయిలో నిలదీస్తే ఇలాగే ఫలితం ఉంటుందేమో.


శాశ్వత సమాధి ?


ప్రత్యేక హోదా అంశం ఈ రోజుతో పార్లమెంట్లో ఇక వినిపించే చాన్స్ లేనట్లే. ఎందుచేతనంటే దీనినే అజెండా చేసుకుని టీడీపీ అవిశ్వాస
తీర్మానం ప్రవేశపెట్టింది. అదే చివరాఖరు అస్త్రమన్న మాట.  దానికి ఎటూ ప్రధాని సమాధానం  చెబుతారు. అది నచ్చినా నచ్చకపోయినా ఇక అంతే. హోదా అన్నది ఎటూ మోదీ ఇవ్వరు. రానున్న రోజులలో మళ్ళీ మోడీ పైనా, కేంద్రం పైనా ఈ విషయమై ఇంత గట్టిగా వాదించే వీలు లేకుండా పోతుంది. అంటే ఓ విధంగా ఈ పొలిటికల్ గేం లో హోదా బలి అయిపోతుందన్న మాట. దీని వల్ల ఓ పార్టీగా టీడీపీ చెప్పుకునేందుకు ఏమైనా ఉండొచ్చేమే కానీ ఏపీకి మాత్రం ఒనకూడేది ఏదీ లేదన్నది నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: