Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 9:20 am IST

Menu &Sections

Search

రాష్ట్రంలో 600వాగ్ధానాలు చేసి 60కూడా నేరవేర్చని టిడిపికి వ్యతిరేఖంగా అవిశ్వాసం?

రాష్ట్రంలో 600వాగ్ధానాలు చేసి 60కూడా నేరవేర్చని టిడిపికి వ్యతిరేఖంగా అవిశ్వాసం?
రాష్ట్రంలో 600వాగ్ధానాలు చేసి 60కూడా నేరవేర్చని టిడిపికి వ్యతిరేఖంగా అవిశ్వాసం?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్రబాబు తన స్వప్రయోజనాల సాధనలో  'ఓటుకు నోటు కేసు'  లో ధారుణంగా ఇరుక్కొని హైదరాబాద్ వదలి విజయవాడకు పారిపోయారు. దాంతో ఆంధ్రప్రదేశ్ హైదరాబాదును ఒక దశాబ్ధం పాటు రాజధానిగా అనుభవించే ఏర్పాటు - విలువ లక్షల కోట్లలో ఉంటుంది. దాన్ని ఏపి కోల్పోయింది నిష్కారణంగా. దీన్ని చంద్రబాబు జాతికి రియంబర్స్ చేయగలరా?  ప్రత్యేకహోదా కోసం పరితపించే ఆంధ్రులకు అంది వచ్చిన ఇంత పెద్ద ప్రయోజనం ఎందుకు వదిలేయాల్సి వచ్చింది. వదిలేయ టానికి అసలు మనసెలా వచ్చింది.

ap-news-india-news-why-not-no-confidence-motion-ag

దాని కోసం చంద్రబాబును క్షమించటం సిగ్గుమాలిన తనం కాదా?

అలాగే అమరావతి నిర్మాణం కోసం పదుల సంఖ్యలో దేశాలు వాటి రాజధాని నగరాలను తన జనాల్ని వెంటేసుకొని తిరిగి వందల వేల కోట్లలో ప్రజాధన దుబారా చేసిన విషయం ప్రశ్నించరా?

మనం ఈ నూతన రాజధాని నగర నిర్మాణం అవకాశంగా తీసుకొని మనదేశంలోనే గొప్ప ఇంజనీర్లు, నిర్మాణ నిపుణులను తయారు చేసుకోలేమా?

సింగపూరుకు మన నగరాన్ని జస్ట్ ₹300-₹400 కోట్లకు అమ్మేయటములో ఎవరు ప్రయోజనం పొందుతున్నారో మెధావులైన ఆంధ్రులకు తెలియదా?

ap-news-india-news-why-not-no-confidence-motion-ag
మన ఇంజనీర్లు మురికివాడలను మాత్రమే నిర్మించటానికి పనికివస్తారన్న పెద్దమనిషి మన ఇంజనీర్ల ఆత్మగౌరవాన్ని కాపాడినట్లు ఎలా భావిస్తాం? దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు? అని దళితులని అవమానించారు. అలాగే కోడలు మగపిల్లాణ్ని కంటానంటే ఏ అత్త మాత్రం వద్దంటుంది? అని ఆకాశంలో సగమైన మహిళల ను అవమానించారు. ఇలా ఇంకేన్నో ఉన్నాయి. స్థలాభావం సమయాభావంతో ఆ కథకమామిష్ అంతా రాయటం లేదు.
ap-news-india-news-why-not-no-confidence-motion-ag

ఇదంతా ఆత్మగౌరవం కోల్పోవటం కాదా! మన ఆత్మగౌరవం మంటగలిపిన చంద్రబాబు బిజెపితో మైత్రి నెరిపి నాలుగేళ్ల తరవాత మళ్ళీ ఎన్నికల కోసం డిల్లీలో మన ఆత్మ గౌరవం అంటూ కొత్తగా నినాదం మొదలెట్టారు.   

ap-news-india-news-why-not-no-confidence-motion-ag

ఈ విషయాల్లొ చలసాని శ్రీనివాస్, సొంఠినేని శివాజి మాట్లాడరేం?

ఇవి చాలవా? చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టటానికి?

ap-news-india-news-why-not-no-confidence-motion-ag

ఆఖరుకు స్వప్రయోజనాలే పరమార్ధంగా బ్రతికే బాబు అవిశ్వాసం ప్రవేశపెట్టిన కేసినేని నానిని వదిలేసి, గల్లా జయదేవ్ ను పార్లమెంటులో మాట్లాడమనే అవకాశం ఇవ్వటంలో ఏ స్వార్ధ ప్రయోజనం ఆశించారు?


ఏ నాలుగు కారణాలతో  (పారదర్శకత, నమ్మకం,  ప్రాధాన్యత, మాట నిలబెట్టుకోవడం) అవిశ్వాస తీర్మానాన్ని పెట్టామని గల్లా జయదేవ్ పేర్కొన్నారో అవే కారణాల తో   ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాలు అధికార తెలుగుదేశం పార్టీ పై అవిశ్వాస తీర్మానం పెడితే ఎలా ఉంటుంది. ప్రతిపక్షం "విప్ జారీ చెస్తే జంపింగ్ జపాంగ్" గాళ్ళతో పాటు అధికారపార్టీ కూడా సెట్ అవుతుంది కదా! ఈ దిశలో వైసిపి, బిజెపి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే? 

ap-news-india-news-why-not-no-confidence-motion-ag

తెలుగుదేశం పార్టీ ఎమ్.పి గల్లా జయదేవ్ తన ప్రసంగంలో ప్రస్తావించిన రెండు సినిమాల విషయంపై సోషల్ మీడియాలో ఆయనపై, టిడిపి అదినేతపై వ్యంగ్యాస్త్రాలు వస్తున్నాయి. "భరత్ అనే నేను" అని సినిమా బ్రహ్మాండంగా విజయవంతం అయిందని, అందులో ఎన్.ఆర్.ఐ గా ఉన్న ఒక యువకుడు చెప్పిన డైలాగులు గుర్తుంచు కోవాలని, ఒకసారి మాట ఇచ్చాక వాటిని నెరవేర్చాలని, లేకుంటే అతను మనిషే కారని అంటారని ఉంటుందని, అలాగే కేంద్రం,ప్రధాని మోడీ ప్రత్యేక హోదాపై మాట నెరవేర్చుకోవాలని ఆయన అన్నారు. అలాగే బాహుబలి సినిమా గురించి కూడా ఆయన ప్రస్తావించి దానికి అయిన ఖర్చు కూడా రాజదానికి ఇవ్వరా? అని ప్రశ్నించారు. 


అయితే మాట నెరవేర్చుకోవడం గురించి మాట్లాడుతున్న జయదేవ్ తమ నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 600 హామీలను ఇచ్చి ఏమి చేశారని, దాని గురించి కూడా చెబుతారా అని ప్రశ్నలు సందిస్తున్నారు. అలాగే స్వయంగా జయదేవ్ ఎపికి ప్యాకేజీ ప్రకటన వచ్చినప్పుడు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ గొప్పది అంటూ  ఇచ్చిన ప్రకటనను మీడియా కటింగ్ తో సహా నెటిజన్లు పెట్టి మరీ ఎద్దేవ చేస్తున్నారు.

ap-news-india-news-why-not-no-confidence-motion-ag    

ap-news-india-news-why-not-no-confidence-motion-ag
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"దగా! దగా! కుట్ర..పాట పై ఎమెల్యే హైకోర్ట్ లో వేసిన కేసు ప్రజా ప్రయోజనమా!
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
About the author