చంద్రబాబు తో జాగ్రత్తగా ఉండాలని జనం అంటుంటే ఏమో అనుకున్నానని రాత్రి అవిశ్వాసానికి ప్రధాని సమాధానమిస్తున్నప్పుడు ఒక స్నేహితుడన్నారు. ఆయన ఒక గోబెల్. ఆయన మొదలెట్టాడంటే ఆ అబద్ధాల చైన్ ఎంతదూరమైనా సాగుతుందన్నది నిజమని నేడు ఋజువైంది.

chandrababu after modi response to No confidence motion కోసం చిత్ర ఫలితం 

నరెంద్ర మోడీ మౌనం వీడారు. నిజాల ప్రవాహ వెల్లువలో అబద్ధాల మురుగు నీరు చెత్తా చెదారం కొట్టుకుపోక తప్పదు అదే జరిగింది. బాబు కు మోడీ ఎందుకు అపాయింట్మెంట్ యివ్వలేదో అర్ధమౌతుందిప్పుడు. చంద్రబాబుతో కలిస్తే టిడిపికి  వైసిపితో ఉన్న పోటీ అనే బురద అంటుకోవచ్చని ఏకంగా చంద్రబాబునే దూరంపెట్టేశారు. స్వార్ధం కోసం చంద్రబాబు ఏమైనా చేయగలరని ఎన్ని అబద్ధాలైనా చెప్పగలరని ఆయన ఒక ఆధునిక గోబెల్ అని పలువురు ఇప్పుడు అనుమానం లేకుండా భావిస్తున్నారు.

 chandrababu after modi response to No confidence motion కోసం చిత్ర ఫలితం

వైసిపి రాజకీయాస్త్రం విసరటం దాని రాజకీయ ధర్మం. దాంట్లో పడకుండా తప్పించుకోవటం విఙ్జుల బాధ్యత. ఈ విషయాన్ని మోడీ చెప్పినా వినకపోవటం చంద్రబాబు తప్పిదం. ప్రత్యేక పాకేజీ కోరింది చంద్రబాబు మాత్రమేనన్నది జగమెరిగిన సత్యం. ప్రధాని నరెంద్ర మోడీ లోక్-సభ ముఖతః ప్రసంగించిన ప్రస్తావించిన విషయాలను వింటే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడి మెదడులో ఉన్న కుతంత్రాల పుట్ట పగిలి నాలుగేళ్ళ నుండి అందులో దాచిన పాపాల పాములు బయట పడ్దాయని జనం నమ్ముతున్నారు. 

chandrababu after modi response to No confidence motion కోసం చిత్ర ఫలితం

పార్లమెంట్ లో ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ధారుణంగా వీగిపోయింది అనేకంటే ఇప్పటివరకు ప్రధాని నరెంద్ర మోడీపై మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకున్న వ్యతిరేఖ భావన మోడీ ద్వారా చంద్రబాబు నాయుడుపై కూడా అదే భావన ఏర్పడింది అవిశ్వాతీర్మానికి సమాధానం ఇచ్చిన సందర్భంగా. ఇద్దరు మంచి స్నేహితులే. స్నేహం ప్రేమ వికటించినప్పటి విస్పోఠనం భరించరానిదే. అది కక్ష కార్పణ్యాల కంటే ప్రమాదకరమైనది.

 

గొబెల్స్ ప్రచారంలో బాబును మించినవారు ఈ విశ్వంలో లేరని విశదమైంది. ఆ విషయం ఓటుకు నోటు నాడు, ఆ తరవాత 21మంది ప్రతిపక్ష వైసిపి సభ్యులను కోనేసి నప్పుడు, మహిళా సాధికారత విషయం లో విపక్ష ఎమెల్యేను రోజాను ధారుణంగా వేదించినప్పుడు, టిటిని సైతం ఒక పరమత సానుభూతిపరుని చేతొలో పెట్టినప్పుడు ప్రజాస్వామ్యం వేదన, మహిళా రోదన, సనాతన ధర్మం శపించినప్పుడు ఆయనకు కనికరం కారుణ్యంలేవని రాజకీయాలకోసం ఏస్థాయికైన దిగజారగలరని ఋజువైంది.  జాతి అవసరాలను పణంగా పెట్టి కులాధిపత్య మీడియా చంద్రబాబుకు ఆ స్తాయిలో మద్దతు నివ్వగలదని అందరికి తెలిసిన విషయమే.    

 chandrababu after modi response to No confidence motion కోసం చిత్ర ఫలితం

ప్రత్యేక పాకేజీ తాను కోరుకొకుంటే కేంద్ర ఆర్ధిక మంత్రికి - ఆ స్థాయిలో సన్మానాలు చేసి ఉండరు. ఆ రహస్యమే సరైన వేదిక పై బట్టబయలైంది. నేడు జనం బాబును అంతగా విశ్వసించాల్సిన పనిలేదు. ఎన్నికల్లో ఓటమి చెందిన వాడికి కారణాలనేకం కనిపిస్తాయి.  ఇక తెలుగుదేశం ఇప్పటికే పూర్తిగా పరిపాలన వదిలేసి దాదాపు ఆరు నెలలౌతుంది.

 

ఇంకిప్పుడు మీడియా పండగలు మొదలౌతాయి. గల్లా జయదేవ్ పార్లమెంట్లో బిజెపిని మోడీని చీల్చి చెండాడేశాడని, రామ్మ్మోహన నాయుడు అగ్నికణికలు వారిపై గుప్పించాడని, కేసినేని నాని మోడీని ధారుణంగా వాయించేశారని ప్రచారపర్వం మొదలౌతుంది. ఇక మనం వాటిని చూసి తరించాలి. చంద్రబాబు రోదన భరించాలి.

 chandrababu after modi response to No confidence motion కోసం చిత్ర ఫలితం

ఇక మనని వదిలేస్తే - నాని అందివచ్చిన అవకాశాన్ని నరెంద్ర మోడీని నిందించటానికి కాకుండా రాష్ట్రాభివృద్దిని కాంక్షించి ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలలో నైనా ప్రయోజనాలను కోరివుంటే బాగుండేది. ఆయన విభజన సమయంలో చంద్రబాబు లాగానే అవకాశం సరిగ్గా వినియోగించు కోకపోవటం ప్రజలపట్ల చేసిన క్షమించరాని తప్పు. చంద్రబాబును నమ్మ కూడదు - ఆయనే ఒక ఆధునిక గోబెల్ అని చెప్పటానికి అనుమాన పడక్కర్లేదు. ఇది సుస్పష్టం. 

chandrababu after modi response to No confidence motion కోసం చిత్ర ఫలితం

చివరగా అవిశ్వాసం వీగిన మీదట చంద్రబాబు నాయుడి స్పందన:

లోకసభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోడీ ఇచ్చిన సమాధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండి పడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత శుక్రవారం రాత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 


ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని మోడీ మళ్లీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆయన అన్నారు. ఇంతటి బాధ్యతారాహిత్యమైన కేంద్రాన్ని గతంలో తానెప్పుడూ చూడ లేదని విమర్శించారు. మెజారిటీ ఉందనే ధీమాతో ప్రధాని మోడీ నీతి, ధర్మం తప్పారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వ దుర్మార్గమైన వైఖరిని గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే నయమనే అభిప్రాయం కలుగుతోందని ఆయన అన్నారు. 


ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటంలో భాగంగా చివరి అస్త్రంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని అన్నారు. తెలుగు జాతికున్న దేశ భక్తిని మోడీ శంకించారని, ఇది ఆక్షపణీయమని చంద్రబాబు అన్నారు. ఏపీకి హామీల విషయమై ప్రధాని మోడీ పాత విషయాన్నే మళ్లీ చెప్పారన్నారు. ఏపీ అభివృద్ధిపై ఏమాత్రం మాట్లాడలేదని అన్నారు.


రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. మోడీవి అహంకారపూరిత మాటలని మండిపడ్డారు. అధికారం ఉందని ఎవరూ ఏమీ చేయలేరనే అంహకారం మోడీని ఆవహించిందని అన్నారు. ఏపీకి న్యాయం చేయాలని అడిగితే తనపై రాజకీయ దాడి చేస్తున్నారని మండి పడ్డారు. నేడు మెజారిటీ-మొరాలిటీ మధ్య పొరాటం జరిగిందని అన్నారు.


అసలు వివాదం ఏపీలో వుంటే, డిల్లీ పార్లమెంట్ లోక్-సభలో పోరాడు తున్నారు అన్న మోడీ మాటతో వైసిపి పై బాబుకున్న కక్ష బిజెపి ద్వారా తీర్చుకోవాలని అనుకున్నది బట్టబయలైంది. 


మోడీ స్పందన దెబ్బకు చంద్రబాబు నలభైయేళ్ళ సుధీర్ఘ రాజకీయ జీవితంలో దాగిన పాముల పుట్టపగిలింది అని చెప్పొచ్చు.

 chandrababu after modi response to No confidence motion కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: