రాజమౌళి బాహుబలి సినిమా తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ ను ఒక ఆట ఆడుకున్నాడు. ఆ సినిమా తో రాజమౌళి టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. దేశం మొత్తం సాహో బాహుబలి అనింది. అయితే రాజమౌళి తరువాత తీయ బోయే సినిమా మీద అంచనాలు ఒక్క సారిగా పెరిగిపోయినాయి. ఆ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. అయితే ఈ సినిమా లో సమంత నటించనున్నదని మాటలు వినిపిస్తున్నాయి. 

Image result for samantha

రాజమౌళి దర్శకత్వం లో నటించాలని ఎవరైనా కోరుకుంటారు. అలాంటి దర్శకుడితో కలిసి పనిచేయాలని ఎంతోమంది హీరో, హీరోయిన్లు పోటీలు పడుతుంటారు. కానీ హీరోయిన్ సమంత మాత్రం రాజమౌళితో సినిమా చేయనంది. ఆమె సినిమా చేయనని చెప్పడానికి రాజమౌళి, సమంతకు మధ్య వైరం ఏమీ కాదండి.. ప్రస్తుతం సమంత మూడు సినిమాల్లో నటిస్తూ బాగా బిజీగా ఉంది. కొత్తగా మరో సినిమాలో నటించేంత సమయం సమంతకు లేదట. చేతిలో ఉన్న సినిమాల్లో నటించడం వల్ల కనీసం ఇంటికి వెళ్ళడానికి కూడా సమంతకు సమయం లేకుండా పోతోంది. 

Image result for rajamouli

 ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి త్వరలో తెరకెక్కించనున్న మల్టీస్టారర్ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించమని కోరారట. అయితే అందుకు సమంత ఒప్పుకోలేదట. ఉన్న పరిస్థితిని రాజమౌళికి వివరించే ప్రయత్నం చేసిందట. ఈ సినిమాలో మీరు నటిస్తేనే బాగుంటుందని రాజమౌళి ఒప్పించే ప్రయత్నం చేశారట. అయితే సమంత మాత్రం సున్నితంగా తిరస్కరించారట. ఇప్పుడు ఇదే తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: