టిడిపి అవిశ్వాసతీర్మానం సందర్బంగా కేంద్ర హోం మంత్రి రాజ నాథ్ సింగ్ లోకసభలో శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ముఖ్యంగా రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబుతో  తమ బంధం విడదీయ లేనిదని, ఎప్పటికీ చంద్రబాబు తమ మిత్రుడేనని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ కు బ్రహ్మాస్త్రం అందించి చంద్రబాబుకు షాక్ ఇచ్చిన రాజ నాధ్

rajnath says chandrababu is their best friend still కోసం చిత్ర ఫలితం

రాజ్ నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు, అలాగే తమకు ప్రత్యేక హోదా వద్దని గతంలో టీడీపి ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ విషయాన్ని అలా పక్కన పెడితే, రాజ నాథ్ సింగ్ వ్యాఖ్యలు చంద్రబాబు ఇంకా బిజెపి తో స్నేహం చేస్తూనే ఉన్నారని వైసిపి నేతలు చేస్తున్న విమర్శలకు గట్టి ఋజువు దొరికినట్లైంది.  అదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

rajnath says chandrababu is their best friend still కోసం చిత్ర ఫలితం

ఆ వ్యాఖ్యల ద్వారా రాజ నాథ్ సింగ్ వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి అస్త్రాన్ని అందించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమ పార్టీ ఎంపీల రాజీనామాలను ఆమోదించిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రప్రభుత్వం అంగీకరించడాన్ని కూడా వైసిపి టీడీపి - బిజెపి మధ్య లోపాయికారీ ఒప్పందం గానే (లాలూచీ) పరిగణిస్తోంది. తాజాగా, రాజ నాథ్ వ్యాఖ్యలతో చంద్రబాబుపై వైసిపి నేతలు మరింతగా విరుచుకు పడే అవకాశం ఉంది. 

rajnath says chandrababu is their best friend still కోసం చిత్ర ఫలితం 

"Politics is not about hatred - BJP is not afraid of Opposition unity" says Rajnath Singh

మరింత సమాచారం తెలుసుకోండి: