తెలుగుదేశం నాయకులు సినిమా కబుర్లు మానేస్తే మంచిది. సినిమా ప్రస్తావన లేకుండా వారికి మాట్లాడటం రాదా? ముఖ్యంగా ఒక సామాజిక వర్గం వారు మట్లాడితే సినిమా అంటారు. అమరావతి నిర్మాణంలోను అంతే. ఒక సినీ దర్శకుడు ఒక అందమైన నిర్మాణాన్ని ఊహించి అదీ కళాదర్శకునితో సెట్ వేయించగలడు. కాని నిర్మాణంలోని సాంకేతికత నిపుణులైన ఇంజనీర్లకు మాత్రమే తెలుసు. అయినా రాజమౌళిని అమరావతి నిర్మాణానికి ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల ముందు కూర్చోబెట్టి ఆయన అభిప్రాయాల ను తీసుకొమని చెప్పటం వారిని అవమానించటమే. "రాజమౌళికి జాకీ యేసి లేపండి" కాని సాంకేతిక నిపుణులను అవమానించటం తగనిపని.

నిన్న లోక్-సభలో అవిశ్వాసం ప్రవేశ పెట్టేటప్పుడు గెల్లా జయదేవ్ "భరత్ అనే నేను, బాహుబలి" సినిమాల ప్రస్థావన అనవసరం. నిజ జీవితంలో ఏ ముఖ్యమంత్రి అయిన అలా చేయగలడా? అది వినోదం. రాజకీయం వినోదం అయితే అది అవిశ్వాసానికే దారి తీస్తుందని ఋజువైంది. స్వల్ప సమయమని తెలుసు. సభాపతి అవకాశం కనికరించి యివ్వటంతో అరిపోయింది కాని లేకుంటే అంత వివరణ ఇవ్వటం జయదేవ్ కు తగదు కదా! 


కనీసం అవిశ్వాసం వీగిన సందర్భంగా తన అభిప్రాయం చెప్పమన్నప్పుడు కేసినేని నాని ప్రధాని నరెంద్ర మోడీని వెటకారం చేస్తూ సినిమాల్లోలా ఏ నటునికి సాధ్యంకాని నటన మోడీ ప్రదర్శించారని అన్నారు. అక్కడ సభాపతి అర్ధగంట సమయమిస్తే నాని ఏమ్మట్లాడేవారో తెలుగు ప్రజలు ఊహించగలరు. సమయం యిచ్చినప్పుడు ప్రజా శ్రేయస్సు కోరేవారెవరైనా ఇతర ప్రయోజనాల సాధన కోసం ఆరాట పడతారు. ఈయనేంటో మోడీ నటన గురించి ఆరాటపడ్డారు. అదే  తెలుగు దేశం పార్టీ ని తెలుగు డ్రామా పార్టీ గా అభివర్ణించటానికి దారి తీసింది. 
galla jayadev & kesineni nani కోసం చిత్ర ఫలితం
మొదటే రామ్మోహననాయుణ్ణి ప్రయోగిస్తే అవిశ్వాసం రక్తిగట్టి ఉండేది. కనీసం టిడిపికి  "వ్రతం చెడ్డా ఫలం దక్కి" ఉండేది. కొన్ని నిముషాలే ఐనా రామ్మోహన్ బిజెపి-మోడీ దుమ్ము దులిపేశాడు. ఇంకొంచెం సమయమిస్తే చెడుగుడు ఆడేసేవాడు. పరిణితి, కొండొకచో నిదానం, బాషపై పట్టు ఎక్కడ నొక్కాలో ఎక్కడ తెల్చాలో తెలిసిన వక్తృత్వం ఆయనను ఎప్పటికైనా ఒక మంచి నాయకుణ్ణి చేస్తుంది. ఆ భావన సభాపతి 75 ఏళ్ళ వయసున్న అనుభవఙ్జురాలు సుమిత్రా మహాజన్ కళ్ళలోనే దేదీప్యమానం గా కనిపించింది. అంతేకాదు పలు సార్లు డిస్ట్రబెన్స్ సందర్భంగా ఆయన్ని "రామ్మోహన్!" అంటూ ప్రెమ తోనే కసిరింది. అందులోనూ అభినందనే. నిజంగా వీళ్ళు మాత్రమే సాధించగలరు అనిపించింది చూపరులకు.      
ram mohan nayudu కోసం చిత్ర ఫలితం
అలా చెయ్యక పోవటంతో టిడిపికి ఆసాంతం వస్త్రాపహరణం జరిగింది.  చంద్రబాబు నాయుడు - వారి మద్దతు మీడియా — తమ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూపోవటం — ఇతర సామాజిక వర్గాల మీద చేస్తున్న అణచివేత గా కనిపించటం జరుగుతుంది. అదే బాబు కొంప ముంచుతుందని అమరావతి లోని మిత్రుల మాట. 


ప్రత్యేక హోదా వస్తే మాకు వచ్చేదేముంది "బూడిద మాత్రమే" అంటున్నారు. కాంట్రాక్టులు, రాజకీయాలు, ప్రయోజనాలు మొత్తం గంపగుత్త గా బాబు సామాజిక వర్గమే సొంతం చేసుకుంటుందని అందుకే మా హృదయాలు ప్రత్యేకహోదా కోరుతున్నా మౌనంగానే ఉంటున్నామని అంటున్నారు. ఇంత చిన్న విషయాల్లో కూడా సామాజికవర్గ ప్రయోజనం చూసినంత కాలం చంద్రబాబు తనేకాదు, తన పార్టీనే కాదు, చివరకు తన కులాన్ని సైతం ఏకాకిని చేసి పారేసే ప్రమాదం ఉంది.      
 ram mohan nayudu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: