ఎన్నికల ఏడాదిలో  ప్రత్యేక హోదా పట్టుకుని ఈదేయవచ్చునని గంపెడాశలు పెట్టుకున్న చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చేశారు మోడీ. పార్లమెంట్ సాక్షిగా బాబు బండారం బయటపెట్టేసి హోదాను ఆయనే తాకట్టు పెట్టిన వైనాన్ని ఏపీ జనానికి బాగా చూపించేసారు. హోదా పై అవిశ్వాసం పెట్టి బ్రహ్మాస్త్రాన్ని టీడీపీ ప్రయోగించేసింది. అదిపుడు గురి తప్పి బాబుకే చుట్టుకుంది. ఈ టైంలో మళ్ళీ  హోదా పేరు ఎత్తితే అది  కచ్చితంగా బూమరాంగే అవుతుంది. 


నెక్సేంటి ?


అదేదో సినిమాలో పాటలా బాబు అండ్ కోకు నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్న ఎదురైంది. తప్పులన్నీ మోడీపైనా, కేంద్రంపైనా తోసేసి హ్యాపీగా జనం ముందుకు పోవచ్చును అనుకున్న పసుపు పార్టీకి అవిశ్వాసం చుక్కూలు చూపించింది. హోదా చుట్టు తిరిగి టీడీపీ కొంపే ముంచింది. హోదా ఎందుకు రాలేదు అంటే బాబే స్వయంగా ప్యాకేజ్ తీసుకున్నారు కనుక. చాలా సింపుల్ గా ఇపుడు ఏపీ జనానికి ఇది మరో మారు అర్ధమైపోయింది.


బురద రెడీ, జల్లించుకునేదెవరు ?


తమ తప్పులు, వైఫల్యాలు, పాపాలు, నేరాలు అన్ని కలిపి పెద్ద బురదే టీడీపీ దగ్గర ఉంది. గత కొన్ని నెలలుగా దాన్ని  మోడీ మీదా, కేంద్రం మీదా జల్లుతూ జనానికి ఓ పిక్చర్ బాబు అండ్ కో చూపించేశారు. మొత్తానికి టీడీపీ దయతో పెట్టిన  అవిశ్వాసంతో మోడీ ఆ బురద కడిగేసుకున్నారు. మీ పాపాలు మీవేనంటూ తిరిగి ఇచ్చేశారు కూడా. ఇపుడు ఆ బురద ఎవరి మీద జల్లాలి. రేపటి ఎన్నికలలో జనం మెప్పు పొందాలంటే, తప్పులు కప్పిపుచ్చుకోవాలంటే  ఎవరో ఒకరిని బకరా చేయాలి. ఎవరా బకరా ???


మరింత సమాచారం తెలుసుకోండి: