గత నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంతో చట్టాపట్టాలేసుకుని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలో తన అనుకూల మీడియా చేత డప్పు కొట్టించి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దొంగ రాజకీయాలకు మళ్లీ తెరలేపారు చంద్రబాబు. 2014 ఎన్నికలలో రాష్ట్రంలో అమలు కాని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారు చంద్రబాబు.

Image result for rajnath singh at parliament

ఈ విషయం మనకందరికీ తెలిసినదే. అయితే తాజాగా ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా రాష్ట్రాన్ని కేంద్రం మోసం చేసింది అని గగ్గోలు పెడుతూ పార్లమెంటులో మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడి...తన రాజకీయ లబ్ధి కోసం తెలుగు ప్రజల పరువును దేశవ్యాప్తంగా తీసేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Image result for rajnath singh at parliament chandrababu

రాజదానికి 1550 కోట్లు, గుంటూరు ,విజయవాడ డ్రైనేజీ ల కోసం వెయ్యి కోట్లు కేంద్రం ఇచ్చిందని, పోలవరం ప్రాజెక్టుకు 7550 కోట్లు ఇస్తోందని ,ఇందులో 6770 కోట్లు ఇప్పటికే ఇచ్చిందని రాజ్ నాద్ సింగ్ చెప్పారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన ఆయన… పద్నాలుగో ఆర్దిక సంఘం సిఫారస్ ల వల్ల కేంద్రం నుంచి వాటా పెరిగందని.. కేంద్రం నుంచి ఎపికి రెండు లక్షల ఆరువేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

Image result for rajnath singh at parliament chandrababu

ఇప్పటికే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను కూడా కేంద్రం పెంచిందన్నారు. విభజన చట్టంలోని దాదాపు అన్ని హామీలను నెరవేర్చామని మిగిలిన వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ షాక్ తిన్నారు. అన్ని నిధులు ఇస్తే అభివృద్ధి ఎక్కడ జరిగింది అని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించడానికి రెడీ అయిపోయారు.




మరింత సమాచారం తెలుసుకోండి: