వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద ఇప్పటి వరకు ఒక విమర్శ ఉంది అదేమిటంటే నరేంద్ర మోడీ ని విమర్షించడం లేదని దీనితో ప్రత్యర్థి పార్టీ అయినా టీడీపీ కి అవకాశం ఇచ్చినట్టయింది. టీడీపీ నేతలు నిత్యం జగన్ మోడీ కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. జగన్ కూడా మోడీ మీద అంతగా విమర్శలు చేయడన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీనితో జగన్ ఇరకాటం  లో పడుతున్నాడు. 

Image result for jagan

వైఎస్సార్‌సీపీ అధినేత‌, ఏపీ ప్రతిప‌క్ష నేత శ‌నివారం దూకుడు పెంచారు. ప్రధాని మోడీకనీ  సైతం విమర్షించడానికి సిద్ధం అయ్యాడు . తిరుప‌తి స‌భ‌లో మీరిచ్చిన ప్రత్యేకహోదా హామీ గుర్తుకు రాలేదా అని ప్రధానిని నేరుగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు అంగీకారం మేర‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామ‌ని ప్రధాని చెప్పడం బాధ క‌లిగించింద‌ని విలేకరుల స‌మావేశంలో మండిప‌డ్డారు. అస‌లు ప్రత్యేక ప్యాకేజీకి అంగీక‌రించేందుకు చంద్రబాబు ఎవ‌రని నిల‌దీశారు. కేంద్రం, టీడీపీ ప్రభుత్వ వైఖ‌రుల‌కు నిర‌స‌న‌గా ఈనెల 24న రాష్ర్ట బంద్‌కు జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు అన్ని పార్టీల, ప్రజాసంఘాల వారు మ‌ద్దతు ప‌లికాల‌ని కోరారు.

Image result for jagan

విలేకరుల స‌మావేశంలో ఉద్వేగంగా మాట్లాడారు. ఆయ‌న మాట్లాడిన అంశాలు రాష్ర్ట ప్రజ‌ల‌ను, రాజ‌కీయ విమ‌ర్శకుల‌ను సైతం ఆక‌ట్టుకున్నాయి.  ఇంకా ఆయ‌నేం మాట్లాడారంటే...బీజేపీతో టీడీపీ బంధం విడ‌దీయ‌లేనిది. మ‌హారాష్ర్ట ఆర్థికమంత్రి భార్యను టీటీడీ బోర్డు స‌భ్యురాలిగా నియ‌మించ‌లేదా? ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్ర షూటింగ్‌లో చంద్రబాబు ప‌క్కన‌ వెంక‌య్యనాయుడు కూర్చోలేదా? కేంద్రమంత్రి నిర్మల‌సీతారామ‌న్ భ‌ర్త ప‌ర‌కాల ప్రభాక‌ర్ ప్రభుత్వ స‌ల‌హాదారుడిగా కొన‌సాగ‌లేదా? మ‌రోవైపు కేంద్ర ఆర్థికమంత్రి రాజ‌నాథ్‌సింగ్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ చంద్రబాబు త‌మ‌కు చిర‌కాల మిత్రుడంటున్నారు. కేంద్రంతో చంద్రబాబు యుద్ధంకాదు... లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు అని జగన్ టీడీపీ ని విమర్సించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: