పార్లమెంట్ లో మోడీ మాట్లాడిన మాటలు టీడీపీ కి మరియు చంద్ర  బాబు కు చెంప పెట్టు లాంటివి. మోడీ మాటల్లో క్లియర్ కట్ గా అర్ధం అవుతుంది. చంద్ర బాబు అవకాశం వాద రాజకీయాలు చేసాడని.. అయితే చంద్ర బాబు  అప్పడూ అడిగిన సీట్లు పెంపు దల జరిగిఉంటే బీజేపీ నుంచి బయటికి వచ్చేవాడు కాదేమో..! తన అవసరాల కోసం బీజేపీ తో నాలుగేళ్లు సావాసం చేసిన బాబు  ఇప్పడూ యూ టర్న్ తీసుకుంటే ప్రజలు గమనించలేని అంత అమాయకులా..!

Image result for chandra babu

హోదా కావాలంటూ మొదలుపెట్టింది. హోదా సంజీవని కాదు అన్నది చంద్రబాబు నాయుడే. హోదా అని ఎవరైనా అంటే వారిని జైల్లో పెట్టిస్తా అని బెదిరించింది చంద్రబాబే. ఆఖరికి లోకేష్ కూడా హోదా పేరుతో జగన్ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నాడని రెచ్చిపోయాడు. వాటన్నింటికీ వీడియోలే సాక్ష్యం. ఇలా మాటమార్చే రాజకీయం తమకు కొత్త ఏమీకాదు కాబట్టి.. ఈసారి కూడా దూసుకుపోతామని చంద్రబాబు అనుకున్నాడు. అయితే ఇక్కడ బాబుకు పాతమాటలే అవాంతరాలుగా మారాయి.

Image result for chandra babu

నిన్న పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ బీజేపీకి మంచి అవకాశం ఇచ్చింది. ప్రత్యేకహోదా వద్దు అని చంద్రబాబు అన్నాడన్న విషయాన్ని ప్రధాని గుర్తుచేశాడు. అంతేగాక.. హోదాకు మించిన స్థాయిలో చేసిన సాయానికి చంద్రబాబు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని చేసిన విషయాన్నీ గుర్తుచేశాడు. ఇక ఏపీ లెవల్లో జగన్ పార్టీ, పవన్ కల్యాణ్‌లు కూడా ఒకేమాటే మాట్లాడుతున్నాడు. బాబు గతంలోనే హోదాను బీజేపీకి తాకట్టుపెట్టేశాడని, హోదావద్దని అప్పుడే రాష్ట్రానికి ద్రోహం చేశాడని.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడని అందరూ ఒకేమాటతో కొడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: