జాతీయ రాజకీయాలలో మరో మారు చక్త్రం తిప్పాలనుకుంటున్నచంద్రబాబు ఆశలు నెరవేరె అవకాశాలు ఏమాత్రం లేవన్నది తాజా అవిశ్వాసం ఎపిసోడ్ నిరూపించేసింది. నాటి పాపాలే  నేటి శాపాలు అన్నట్లు బాబు  ఆ ఫలితాలను ఇపుడు అనుభవిస్తున్నారు. డిల్లీ వెళ్ళి ఎంత మంది నాయకులను కలసినా వారంతా బాబు వెనక నిలబడక పోవడానికి ఇదే కారణం. బాబుని నమ్మలేమన్న భావన అందరిలోనూ ఉంది. దానికి తోడు ఇపుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి చాల మంది నాయకులు తయారుగా ఉన్నారు.


మమత, మాయావతి, ములాయం, శరద్ పవార్, ఇక కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్, వాళ్ళందరికీ బాబుని హీరో చేసి వెనక నిలబడాలని ఎందుకు ఉంటుంది. అందుకే ఆయన పెట్టిన అవిశ్వాసానికి తూతూ మంత్రంగా మద్దతు ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. ఇపుడు జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ బాబును నమ్మే రాజకీయ పక్షం ఒక్కటీ లేదు. ఇదంతా ఆయన చేసుకున్న పుణ్యమే. 


నాడు  చక్త్రం సర్రున తిరిగింది:


దాదాపు రెండు దాశాబ్దాలకు పూర్వం జాతీయ రాజకీయాలలో చంద్రబాబు చక్రం తిప్పారు. 1996లో పీవీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్ ఓడిపోయి బీజేపీ 160కి పైగా సీట్లతో అతి పెద్ద పార్టీగా ఆవతరించింది. మ్యాజిక్ ఫిగర్ కి వందకు పైగా సీట్ల దూరంలో నిలిచిన బీజేపీకి వాజ్ పేయి తొలి ప్రధాని అయ్యారు. కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీకి ఎవరూ నాడు మద్దతు ఇవ్వలేదు. దాని వెనక చంద్రబాబు వ్యూహం వుంది. నాడు బీజేపీ, కాంగ్రెస్ లకు  ప్రత్యామ్నాయంగా మూడవ కూటమికి యునైటెడ్ ఫ్రంట్ పేరిట బాబు ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నారు. అలా దెవెగౌడ ప్రధానిగా  బయట నుంచి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అలా తాడూ బొంగరం లేని జాతీయ పక్షాలను, ప్రాంతీయ పార్టేలను నాడు బాబు కలపగలిగారు.


వాళ్ళు నమ్మడంలేదా  :


అప్పటికి కొన్ని నెలల ముందే  బాబు ఏపీకి సీఎం అయ్యారు. కేవలం 45 ఏళ్ళ వయసులోనే ఆయన ఆ పదవి చెపట్టారు. ఎలా పవర్ దక్కిందన్నది పక్కన పెడితే జాతీయ రాజకీయాలలో బాబు ఓ విధంగా అలా వెలుగు వెలిగారు. ఆ తరువాత 1998 ఎన్నికలు వచ్చేసరికి బాబు ప్లేట్ ఫిరాయించి బీజేపీ గూటికి చేరారు. అదే తీరున 1999లోనూ ఆ పార్టీకే అండగా నిలబడ్డారు. ఈ పరిణామాలతో వామపక్షాలకు ఆయన దూరమయ్యారు. అంత కంటే ముందు తన రాజకీయ విశ్వసనీయతను అలా కోల్పోవడం మొదలుపెట్టారు. ఇక 2009 ఎన్నికలలో మళ్ళీ వామపక్షాలతో చెలిమి చేశారు, 2014 నాటికి తిరిగి బీజీపీ గూటికి చేరారు ఇలా అధికారం, ఆకాశంవాదం  లెక్కలతో బాబు ఎప్పటికపుడు తన రూట్ మార్చేస్తూ ఇతర రాజకీయ పక్షాలకు చులకనైపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: