దేశం లో తానే సీనియర్ రాజకీయ నాయకుడు అంటూ డంబము మాటలు చెబుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ప్రస్తుత రాజకీయాలలో పన్నుతున్న వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత ప్రతిపక్షనేత యువనేత జగన్ వ్యూహాల దెబ్బలకు తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోతున్నయి  అని అనటంలో సందేహం లేదు.

Image result for chandrababu

అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుటిలమైన రాజకీయాలకు తెరలేపారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అధికార ప్రలోభాలకు అవినీతి డబ్బులు చూపి తన పార్టీలోకి తీసుకొని నామరూపాలు లేకుండా చేద్దామని అనుకున్నాడు చంద్రబాబు. కానీ చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. అయితే చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అన్నా కాంటీన్ అంటూ మరో కొత్త డ్రామా ఆడాడు కానీ అందులో జరిగిన అతి పెద్ద అవినీతి బయటకు రావడంతో ఆ వ్యూహం కూడా సెట్ అవ్వలేదు.

Related image

పోనీ సర్వే ఫలితాలు అయినా టీడీపీ కి అనుగుణంగా వస్తాయి అనుకుంటే ఆ ఫలితాలు కూడా జగన్ కి అనుకూలంగా వచ్చి 2019 లో జగనే సీఎం అవుతాడు అంటూ తేల్చి చెప్పేసాయి . ఇలా చంద్రబాబు అనుకున్న వ్యూహాలు అన్నీ బెడిసి కొట్టడంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు చంద్రబాబు.

Related image

తాజాగా పార్లమెంటు సాక్షిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వైసీపీని ఇరుకున పెట్టాలని కేంద్రంపై నాలుగు తిట్లు తిట్టి రాష్ట్రంలో రాజకీయ మైలేజ్ సంపాదించుకుందం అనుకున్న చంద్రబాబుకి మోడీ తన ప్రసంగంతో ఇచ్చిన స్ట్రోక్ కి….చంద్రబాబుకి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావటం లేదు. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడా కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అయితే దీనంతటికి కారణం జగనే అని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.




మరింత సమాచారం తెలుసుకోండి: