ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా విషయలో టీడీపీ తీసుకున్న స్టాండ్ బీజేపీ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో నామా రూపాలు లేకుండా చేస్తుంది. చంద్ర బాబు మమ్మల్ని మోసం చేసాడని బీజేపీ ఆరోపణ చేస్తుంది. అలాగే టీడీపీ కూడా బీజేపీ  మీద ఓ రేంజ్ లో విమర్శలు చేస్తుంది. అయితే ఇంతవరకు బీజేపీ నాయకులూ మాత్రమే టీడీపీ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పడూ స్వయంగా మోదీ కూడా రంగం లోకి దిగి నట్లు కనిపిస్తుంది.

Image result for narendra modi

లోకసభలో ప్రధాని ఏపీకి హామీ ఏమీ ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సహా ఇతర నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి తాను హామీ ఇచ్చిన వీడియోను పోస్టు చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీ గంటపాటు మాట్లాడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఇతర అంశాలపై మాట్లాడాయి. దీంతో మోడీ వాటికి కౌంటర్ ఇస్తూ, ఏపీకి హామీ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత చంద్రబాబు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏపీకి హామీ ఇవ్వలేదని, రాజ్‌నాథ్ తనను స్నేహితుడు అని చెప్పే బదులు ఏమిచ్చామో, ఏం ఇవ్వలేదో చెబితే బాగుండేదన్నారు.

Image result for narendra modi

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నా సోదరీ, సోదరీమణులకు నేను హామీ ఇస్తున్నాను.. తమ ఎన్డీయే ప్రభుత్వం ఏపీ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్నారు. లోకసభలో విజయం సాధించామని, తమకు 125 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉందని కూడా మోడీ పేర్కొన్నారు. అస్థిరతను సృష్టించడానికి కాంగ్రెస్‌ ఎలా ప్రయత్నించిందో అంతా చూశారనని, 1999లోనూ, అంతకుముందూ అలాగే చేశారని, ఎన్డీయే సర్కారుకు మద్దతుగా నిలిచిన ప్రతి పార్టీకి కృతజ్ఞతలు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: