మాట తప్పిన వాడు మనిషే కాడు, మోదీపై అవిశ్వాసం టైంలో టీడీపీ ఎంపీ గల్లా  జయదేవ్ గారు పలుకులివి. ఒక్క ప్రత్యేక హోదా మాట తప్పితేనే మోడీని మనిషే  కాదంటూ ఆ పార్టీ పార్లమెంట్లో ఓ రేంజిలో  రెచ్చిపోయింది. మరి  టీడీపీ పోయిన ఎన్నికలలో ఆరువందలకు పైగా హామీలు ఇచ్చింది. అందులో పది శాతం కూడా సరిగా అమలు కాలేదు  ఈ ఒక్క పాయింట్ తో చంద్రబాబును కూడా చెడుగుడు ఆడేయొచ్చు కదా. ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆ దిశగా అడుగులేస్తే మేమూ రెడీ అంటోంది బాబు మాజీ మిత్ర పక్షం బీజేపీ.


ఆ కిక్కే వేరబ్బా :


ఎన్నికల ఏడాదిలో టీడీపీని బోనులో నిలబెట్టి ఉతికి ఆరేసే చాన్స్ వైసీపీ తీసుకుంటే మాత్రం ఆ కిక్కే వేరుగా ఉంటుంది మరి. అపుడెపుడో బాబు మీద వైసీపీ అవిశ్వాస అస్త్రం ప్రయోగించింది. కానీ ఇపుడు ఏపీలో పొలిటికల్ హేట్ బాగా పెరిగింది. ఓ వైపు ప్రత్యేక హోదా పాపం మోడీకి అంటకట్టాలని టీడీపీ సంధించిన అవిశ్వాస అస్త్రం బూమరాంగ్ అయింది. ఏపీలో జనం మూడ్ బాబుకు యాంటీగా ఉంది. ఇదే కరెక్ట్ టైం. ఇక్కడ కూడాఅవిశ్వాస  అస్త్రం సంధిస్తే వైసీపీకే క్రెడిట్ ఉంటుందని.  పొలిటికల్ మైలేజ్ కూడా అనూహ్యంగా వస్తుందని  అంచనాలు పెరుగుతున్నాయి.


జగన్ రెడీయేనా :


ప్రస్తుతం జగన్ పాదయాత్రలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఇంకా మూడు జిల్లాలు బ్యాలన్స్ ఉన్నాయి. ఇవి పూర్తి అయ్యేటప్పటికి మరో రెండు నెలలు పట్టేట్టుంది అప్పటికి కంప్లీట్ గా ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది. ఇక మిగిలేవి అసెంబ్లీ శీతాకాల సమావేశాలే. వాటికి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కలిపేసి వచ్చే ఏడాది పెడితే ఇక అవిశ్వాసానికి నో చాన్స్. అంటే ఈ వర్షాకాల సమావేశాలోనే అవిశ్వాసం పెట్టాలి. మరి జగన్ రాలేని అవిశ్వాసం పెట్టినా అడ్వాంటేజ్ ఏమీ రాదు. అలా కాకుండా  ఒకటి రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసుకుని జగన్ అసెంబ్లీకి వస్తే మాత్రం హై ఓల్టేజ్ పాలిటిక్స్ కి తెర తీసినట్లే. మరి జగన్ అలా ఆలోచిస్తారా.. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: