రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన బిజెపి, టిడిపి పార్టీ నాయకులపై ఆంధ్రరాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నాయకులు ఏకి పారేస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి గతంలో ఏ పార్టీతో కుమ్మక్కయ్యి రాష్ట్ర ప్రజలను మోసం చేశారో ఆ పార్టీపై పోరాటం అంటూ చంద్రబాబు చేసిన నీచ రాజకీయం బయటపడటంతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్య ప్రజలు తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై మండి పడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తమ గళాన్ని వినిపింప చేస్తున్నాయి.

Image result for modi

వాస్తవంగా మాట్లాడు కావాలనుకుంటే ఇప్పటిదాకా ప్రత్యేకహోదా సజీవంగా ఉందంటే దానికి కారణం రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ యొక్క పోరాటం అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలావుండగా వైయస్సార్సీపి పార్టీకి చెందిన అంబటి రాంబాబు పార్లమెంటులో జరిగిన అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ..ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ మహా నటులని వ్యాఖ్యానించారు. ప్రధాని నటన మాత్రమే చేయగలరని.. చంద్రబాబు మాత్రం జీవించలగరని ఆయన విమర్శించారు.

Image result for ambanti

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను వైసీపీ సజీవంగా ఉంచిందన్నారు. హోదా కోసం పోరాటంచేస్తుంటే వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా అంబటి ప్రస్తావనకు తీసుకొచ్చారు. అవిశ్వాసంలో పార్టీలను ఏకం చేసినట్లు చంద్రబాబు హడావుడి చేశారంతేనన్నారు. చంద్రబాబు ఏ లోపాయికారి ఒప్పందం కోసం ఢిల్లీకి వెళ్లారో చెప్పాలన్నారు.

Image result for chandrababu

అంతేకాకుండా రాష్ట్రంలో అడ్డదిడ్డంగా అవినీతి చేసి రాష్ట్ర టిడిపి నాయకుల పై విమర్శలు చేసే బీజేపీ నేతలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు అంబంటి రాంబాబు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ రెండూ కలిసి ఆంధ్ర ప్రజలను మోసం చేశాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన విధంగా  ఆంధ్ర ప్రజలు బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు అంబంటి రాంబాబు.




మరింత సమాచారం తెలుసుకోండి: