కేవలం పదమూడు జిల్లాల ముఖ్యమంత్రి, చిన్న ముఖ్యమంత్రి అంటూ మంత్రి గంటా ఓ ఫ్లోలో మాట్లాడిన మాటలు విన్న వారికి మాత్రం వేరే అర్ధాలు వినిపిస్తున్నాయి. మోడీని కామెంట్ చేసే క్రమంలో గంటా ఈ మాటలు వాడినా  ఎక్కడో బాబు ఇగో దెబ్బ తినేలాగే  ఉన్నాయంటున్నారు. అసలే బాబుకు తన సీనియారిటీపైనా, తన పొలిటికల్ ఫిగర్ మీదా ఎంతో అతి విశ్వాసం, నేను తలచుకుంటే, నేను కనుక రంగంలోకి దిగితే ఇలా ఉంటాయి బాబు గారి గొప్పలు. మరి అటువంటి బాబుని పట్టుకుని మరీ చిన్న ముఖ్యమంత్రిని చేసేశారు గంటా మంత్రివర్యులు.


ఏదో చెప్పాలనుకుంటే :


కేంద్రంపై, మోడీపై అందరూ కామెంట్స్ చేస్తున్నారు, నేనూ ఏదో మాట్లాడాలనుకుని గంటా వారు ఈ రొజు విశాఖలో  ప్రెస్ మీట్ పెట్టేశారు. బాబు మెప్పును పొందే ఆత్రుతలో ఆయన్నే తక్కువ చేసి చూపించేశారు. మీరు దేశానికి ప్రధాని, మా నాయకుడు అతి చిన్న రాష్ట్రానికి సీఎం అయినా అవిశ్వాసం పెట్టాం, చూశారా అంటూ గంటా ధాటీగా మాట్లాడేశారు. కానీ బాబుని చిన్న సీఎం అంటే ఆయన ఊరుకుంటాడా. అసలే ఉమ్మడి ఏపీ నుంచి సగం ముక్కకు ఏలిక అయ్యానని నిత్యం కుములుతూనే ఉన్నారాయే. అయినా ఎక్కడా తక్కువ చేసుకోకుండా పూటకోసారి ప్రధాని చాన్స్ రెండు మార్లు వదిలేశానని అంటూంటారు.


ఆ విధంగా కాబోయే ప్రధాని అన్న ఫీలింగ్ తో టైం పాస్ చేస్తూంటారు. పైగా మోడీ నాకు జూనియర్ అని కూడా చెబుతూంటారు.  మరి గంటా మోడీతో పొలిక పెడుతూ మీరు పెడుతూ మోడీని పెద్ద నాయకున్ని చేస్తూ  బాబుని చిన్న చేస్తే తట్టుకోగలరా. ఇంతకీ కావాలని అన్నారా. ఫ్లో లో దొర్లేసిందా... ఏమో ...అసలే ఇద్దరికీ అంతగా రిలేషన్స్ బాగోలేవని బయట టాక్ మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: