చంద్ర బాబు నాయుడు మోడీ మీద మరోసారి ఫైర్ అయ్యాడు. చంద్ర బాబు ను ఉద్దేశించి పార్లమెంట్ లో మోడీ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. బాబు వైసీపీ ట్రాప్ లో చిక్కుకున్నారని తెలిపిన సంగతీ తెలిసిందే. దీనితో బాబుకు చిర్రెత్తుకొచ్చింది. నన్ను జగన్ తో పోలుస్తారా... అని జాతీయ మీడియా లో ఫైర్ అయ్యినాడు. 2019 లో బీజేపీ తో కలిసేది లేదని వారు పిలిచిన పోనని స్పష్టం చేశాడు. 

Image result for chandra babu

వాజపేయి మూడురాష్ట్రాల విభజను సున్నితంగా చేశారని, కాంగ్రెస్‌ వాళ్లు అశాస్త్రీయంగా ఏపీని విభజించారని ప్రధాని అన్నారని, అలాంటప్పుడు కాంగ్రెస్‌ చేసిన తప్పును సరిదిద్దే బాధ్యత ఆయనకు లేదా అని చంద్రబాబు ప్రధానిని ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లే హోదా ఇవ్వలేకపోతున్నట్లు మోడీ చెప్పారని, ఆర్థిక సంఘం ఎక్కడ అలా చెప్పిందో చూపించాలని డిమాండ్‌ చేశారు. మోడీ తన తప్పును ఆ సంఘాన్ని వివాదంలోకి లాగుతున్నారన్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కేంద్ర, రాష్ట్ర సంబంధాలను నిర్వహించే తీరు ఇదా అన్నారు.

Image result for chandra babu

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరిపక్వత ప్రదర్శించారని, తాను ప్రదర్శించలేకపోయానని మోడీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అన్నారు. మోడీ కంటే ముందే తాను సీఎంను అనిగుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానం నైతికతకు, మెజార్టీకి మధ్య యుద్ధమన్నారు. ప్రతి సమస్యకూ రాజకీయ పరిష్కారం ఉంటుందని, కానీ కేంద్రం ఆ దిశగా ఏనాడూ చొరవ తీసుకోలేదన్నారు. నాయకత్వంపై అసలు మీ బీజేపీ ఎంపీల్లో విశ్వాసం ఉందా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: