Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 1:59 pm IST

Menu &Sections

Search

రేపు ప్రత్యేక హోదా కొసం ఆంధ్రప్రదేశ్ లో తీవ్రస్థాయి అందోళన - బంద్: వైసిపి

రేపు ప్రత్యేక హోదా కొసం ఆంధ్రప్రదేశ్ లో తీవ్రస్థాయి అందోళన - బంద్: వైసిపి
రేపు ప్రత్యేక హోదా కొసం ఆంధ్రప్రదేశ్ లో తీవ్రస్థాయి అందోళన - బంద్: వైసిపి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రధాని నరేంద్ర మోడీ టిడిపి అవిశ్వాస తీర్మానానికి సమాధానం ఇస్తూ ప్రత్యేక ప్యాకేజి అర్ధించింది ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేయటంతో ఇంతవరకు నాటకాలాడిన తెలుగుదేశం పార్టీకి ధిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. రాజ్స్త్రంలో ప్రజల హృదయాల్లో రగులుతున్న  తీవ్రమైన ప్రత్యేక హోదా  అకాంక్ష  ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బ్రద్దలై ఆ టిడిపి-బిజెపి లను దహించివేసే తరుణం ఇంకెంతో దూరంలో లేదని వైసీ నాయకత్వం అభిప్రాయపడుతుంది. ప్రజాధనం దోపిడీ చేయటానికి చంద్రబాబు వేసిన ప్రణాలికే "ప్రత్యేక ప్యాకేజి" అని రాష్ట్ర మంతటా యువత భావిస్తుంది.
ap-news-telangana-news-national-news-special-categ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ, రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని మరోసారి కేంద్రానికి గట్టిగా తెలియజేసేందుకు ప్రతిపక్ష వైసిపి ఈ నెల 24న ఇచ్చిన రాష్ట్ర బంద్‌ పిలుపుకు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలతోపాటు అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం, ముస్లిం జన జాగృతి సమితి బంద్‌కు తమ మద్దతు ప్రకటించాయి. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాగుడు మూతలు ఆడుతూ ప్రజలను మోసగించే తీరును తూర్పారబడుతూ  ప్రతిపక్ష వైసిపి నేత వైఎస్‌ జగన్మొహన రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.
ap-news-telangana-news-national-news-special-categ
ప్రత్యేక హోదా తోనే ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి సాధ్యమని, విభిన్న అవకాశాలతో తమ భవిష్యత్తు బాగుపడుతుందని యువత విశ్వసిస్తోంది. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా విసిపి అలుపెరగని పోరాటం కొనసాగిస్తుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అని, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా? అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా తప్పనిసరని, దాన్ని సాధించుకోవడానికి అందరం కలిసి ప్రయత్నిద్దామని వైఎస్‌ జగన్‌ పదే పదే చెప్పినా చంద్రబాబు చెవికెక్కించుకోలేదు. 
ap-news-telangana-news-national-news-special-categ
పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల సమయంలో విసిపి ఎంపీలు ప్రత్యేక హోదా కోసం తీవ్రస్థాయిలో కేంద్రానికి తమ వాణిని ప్రజాభిప్రాయాన్ని వినిపించి కేంద్రంపై 13 సార్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. చివరకు ఏప్రిల్‌ 6న తమ పదవులకు రాజీనామా చేశారు. అదే రోజు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఎంత అవసరమో దేశానికి తెలియజెప్పారు. కాగా, ప్రత్యేక హోదాను కోరుతూ విసిపి చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను చంద్రబాబు సర్కారు ఎక్కడి కక్కడ అణచివేయడానికి ప్రయత్నించింది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరిని చితకబాది జైళ్ళలో పారేసింది. 

ap-news-telangana-news-national-news-special-categ
విద్యార్థులను, యువతను చైతన్యవంతుల్ని చేయడానికి విసిపి యువభేరి కార్యక్రమాలను రాష్ట్రమంతటా నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమాలకు వెళ్లినా, ఆ ఊసెత్తినా పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని భయ భ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా పిల్లలు జాగ్రత్త అంటూ తల్లిదండ్రులకు హెచ్చరికలు పంపారని, ఇప్పుడేమో చంద్రబాబు "యూటర్న్‌" తీసుకుని ఆయన జాతీయ స్థాయిలో యూటర్న్ అంకుల్ గా ప్రత్యే గుర్తింపుతో బిజెపి తో నాలుగేళ్ళు అంటకాగి ఎన్నికలు పదినెలలుండగా మళ్ళా ప్రత్యేకహోదా అవసరమని అంటున్నారని, ఊసరవెల్లులు కూడా ఇలా రంగులు మార్చలేవని విద్యార్థులు, యువత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

ap-news-telangana-news-national-news-special-categ

ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు, కాంగ్రెస్, వివిధ ప్రజా సంఘాలు ప్రత్యేక హోదా కోసం నినదించిన సందర్భాల్లోనూ చంద్రబాబు సర్కారు వారిని అణచివేయ డానికే ప్రయత్నించింది.
ap-news-telangana-news-national-news-special-categ
రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా స్వప్రయోజనాల సాధనే పరమార్ధంగా ప్రత్యేక ప్యాకేజీ కావాలని కేంద్రం వద్ద చంద్రబాబు అర్రులు చాచారని, ఇప్పుడేమో అసలు ప్రత్యేక ప్యాకేజీ కోరలేదని, హోదాను వద్దనలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర ప్రజలను మోసగించాయని, ఈ పార్టీలను నమ్మొద్దని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో తొలి నుంచి ఒకే మాటపై ఉన్నది వైసిపి మాత్రమేనని  అందుకే ఆ పార్టీ బంద్‌ కు పిలుపు నిచ్చినా, ఏ ఆందోళన కార్యక్రమానికి పిలుపు నిచ్చినా విజయవంతం అవుతున్నాయని టీడీపీకి చెందిన ఒక మాజీ మంత్రి, సీనియర్‌ నేత విజయవాడ మీడియాకు చెప్పారు. ఈ బంద్‌కు అన్ని వర్గాల మద్దతు విషేషంగా లభిస్తోందని సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్న ఒక సీనియర్‌ నాయకుడు అభిప్రాయపడ్డారు.
  ap-news-telangana-news-national-news-special-categ
ap-news-telangana-news-national-news-special-categ
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పిల్లాడి లెటర్ ఈ ప్రపంచానికే షాక్! వారెవ్వా! బుడుగా! ఇకనైనా నిద్రలేవండి
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన అత్త: లక్ష్మిపార్వతి
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
పచ్చ మీడియా-కుల పిచ్చి రెండే ప్రధానాస్త్రాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొన్న ఏపి సిఎం
ఎడిటోరియల్: జగన్ మీరు చాలా లక్కీ!  మీ ప్రత్యర్ధి చంద్రబాబు తన గోయ్యిని తానే త్రవ్వేసుకుంటున్నారు కదా!
ఖర్గే పై ప్ర‌శంస‌ల జడివాన, రాహుల్‌పై సెటైర్ల చెణుకులు ... అదీ మోడీ స్టైల్!
రాఫెల్‌ డీల్ లో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్: కాగ్ రిపొర్ట్
ఇక చంద్రబాబు సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సిందే!
మూలాయం దెబ్బకు సోనియా-రాహుల్ గుండెల్లో రైళ్ళు - మోడీ బృందానికి అవధులు దాటిన ఆనందం
కాపులు అగ్రవర్ణ పేదలా? బిసి లా? రెంటికి చెడ్డ రెవడా? తేల్చుకోవలసింది కాపులే!
ఢిల్లీ దీక్షలో చంద్రబాబు పరువు ప్రతిష్ట దిగజార్చిన  “ఆ ఇద్దరు”
About the author