జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూడా  చంద్ర‌బాబునాయుడు మోసం చేశారా ?  త‌న‌ను చంద్ర‌బాబు మోసం చేశార‌ని స్వ‌యంగా ప‌వ‌న్ కల్యాణే చెబుతున్నారు. కాబ‌ట్టి న‌మ్మ‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ చంద్ర‌బాబు చేసిన మోసం ఏంటి ? అంటే 2014 ఎన్నిక‌ల త‌ర్వాత త‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తాన‌ని చెప్పి హ్యాండ్ ఇచ్చార‌ట‌. చంద్ర‌బాబు త‌న‌ను మోసం చేసిన విష‌యం  ఇంత‌కాలానికి ప‌వ‌న్ కు ఎందుకు గుర్తుకు వ‌చ్చిందో ?  ఒక‌సారి మోసం చేశారని అనుకున్న త‌ర్వాత కూడా చంద్ర‌బాబుతో అంత స‌న్నిహ‌తంగా ఎందుకు మెలిగారో ప‌వ‌నే స‌మాధానం చెప్పాలి. 


పోటీ చేయ‌కుండా చంద్ర‌బాబే అడ్డుకున్నార‌ట‌

Image result for pawan kalyan photos

చంద్ర‌బాబును ప‌వ‌న్ 2012లోనే క‌లిశార‌ట‌. ఓ పార్టీ పెట్టి 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకున్న విష‌యాన్ని ప్ర‌స్తావించార‌ట‌. 70 సీట్ల‌లో పోటీ చేయాల‌ని కూడా ప‌వ‌న్ నిర్ణ‌యించార‌ట‌.  అయితే, చంద్ర‌బాబు అడ్డుకున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌లు చాలా కీల‌క‌మైన‌వ‌ని, విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి కాబ‌ట్టి ఆ ఆలోచ‌న వ‌ద్ద‌ని చంద్ర‌బాబు వారించిన‌ట్లు ప‌వ‌న్ చెప్పారు. త‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తాన‌న్న హామీని కూడా రెండు ప‌త్రిక‌ల్లో చంద్ర‌బాబు రాయించిన‌ట్లు గుర్తు చేశారు.

అసెంబ్లీలో పోరాటం చేసుండేవాణ్ణి

Image result for ap assembly seats

తామిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు రెండ ప‌త్రిక‌ల్లో రాగానే చంద్ర‌బాబుపై త‌న‌కు న‌మ్మ‌కం పోయింద‌ని ప‌వ‌న్ చెప్పారు. త‌ర్వాతే తాను ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్ధి న‌రేంద్ర‌మోడిని క‌లిసిన‌ట్లు వివ‌రించారు.  అప్ప‌ట్లోనే తాను అనుకున్న‌ట్లుగా 70 సీట్ల‌లో పోటీ చేసుంటే ఇపుడు అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే అవ‌కాశం త‌న‌కుండేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.  ప‌వ‌న్ తాజాగా చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ నిజాలే అని అనుకుందాం.  అయితే, ఇక్క‌డే అంద‌రిలోనూ అనుమానాలు మొద‌ల‌య్యాయి.


ఇపుడు ఆరోప‌ణ‌లు చేస్తే ఉప‌యోగ‌మేంటి ?


ఎన్నిక‌ల‌కు ముందే అంటే 2012లోనే  చంద్ర‌బాబు త‌న‌ను మోసం చేశార‌ని ప‌వ‌న్ భావిస్తే మ‌ళ్ళీ 2014 ఎన్నిక‌ల్లో అదే చంద్ర‌బాబుకు ఎందుకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు ?  ఆ త‌ర్వాత కూడా అనేక సంద‌ర్భాల్లో చంద్ర‌బాబుకు ప‌వ‌న్ ఎందుకు మ‌ద్ద‌తు కొనసాగించారు ?  ఎప్పుడో 2012లో జ‌రిగిన విష‌యాల‌ను ఇపుడు ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ ప్ర‌స్తావించ‌టంలో ఉద్దేశం ఏంటి ? ఇంత కాలం చంద్ర‌బాబుతో అంట‌కాగిన ప‌వ‌న్ ఇపుడేదో విష‌యంలో చెడిన త‌ర్వాత పాత విష‌యాల‌ను త‌వ్వి తీయ‌టంలో ఉప‌యోగ‌మేంటో  ప‌వ‌నే చెప్పాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: