కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు..  ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేసిన చంద్ర‌బాబు.. అడ్డంగా దొరికి పోయారు. మోడీ చేతిలో పార్ల‌మెంటు వేదికగా ఘోరంగా ప‌రాభ‌వించ‌బ‌డ్డారు. జ‌గ‌న్ ప‌న్నిన ఉచ్చులో బాబు చిక్కుకున్నారంటూ.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన చంద్ర‌బాబును అడ్డంగా అవ‌మానించారు. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్ న‌యం అంటూ బాబు వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. వాస్త‌వానికి ఇవ‌న్నీ చంద్ర‌బాబు ఊహించి ఉండ‌రు. ఏదో ప్ర‌త్యేక హోదా అడుగుతున్నాం.. ఏపీలో మైలేజీ ఖాయం.. అనుకున్నారు. అయితే, అనూహ్యంగా మోడీ టీం నుంచి మోడీ నుంచి కూడా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు వినాల్సి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో మోడీని అడ్డుకునే టీడీపీ ఎంపీ ఒక్క‌రంటే ఒక్క‌రూ లేక‌పోయారు. 

Image result for ap special status

ఇక‌, చంద్ర‌బాబు నాలుగేళ్లు త‌మ‌తో కాపురం చేశార‌ని చెబుతూనే .. త‌మ‌కు మిత్రుడు అన‌డం ద్వారా బాబును పూర్తిగా డిఫెన్స్ లో ప‌డేశారు మోడీ! ఏపీలో జ‌గ‌న్‌.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడ‌ని, ఏపీకి అన్యాయం చేస్తున్నాడ‌ని, అలాంటి జ‌గ‌న్ మ‌న‌కు అవ‌స‌ర‌మా? అని చంద్ర‌బాబు ప‌దే ప‌దే ఇటీవ‌ల కాలంలో చెబుతూ వ‌చ్చారు. అయితే, ఇప్పుడు ముసుగు తొలిగిపోయింది. మోడీనే స్వ‌యంగా చంద్ర‌బాబుతో ఉన్న అనుబంధాన్ని వెల్ల‌డించారు. ఇక‌, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అయితే.. ఏకంగా.. బాబు త‌మ‌కు మంచి మిత్రుడ‌ని పార్ల‌మెంటు వేదిక‌గా చెప్పేశారు. ఈ ఇద్ద‌రే కాదు.. మిగిలిన బీజేపీ నేత‌లు ఎవ‌రూ కూడా జ‌గ‌న్ కానీ, ఆయ‌న పేరును కానీ, వైసీపీ గురించి కానీ ప్ర‌స్తావించ‌లేదు. దీనిని బ‌ట్టి ఎవ‌రు ఎవ‌రితో `ట‌చ్‌`లో ఉన్నారో అర్ధం చేసుకోవ‌చ్చు. 

Image result for pm

ఈ ప‌రిణామాలు నిజంగా చంద్ర‌బాబు ఊహించి ఉండ‌రు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న అవిశ్వాసానికి అంద‌రి మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టారు. కానీ, ఆఖ‌రు నిముషం వ‌చ్చేస‌రికి ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. ఏ ఒక్క పార్టీ(ఆప్ మిన‌హా) కూడా ఏపీ ప్ర‌స్థాన తీసుకురాలేదు. ములాయం సింగ్ వంటి జాతీయ స్థాయిలో పెద్ద పేరున్న నాయ‌కుడు సైతం ఏపీ గురించి క‌నీస ప్ర‌స్థావ‌న తీసుకురాలేదు. పైగా ఆయ‌న త‌న రాష్ట్ర స‌మ‌స్య‌లే ప్ర‌స్తావించారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏం చేశార‌నే వ్యాఖ్య‌లు ఎదుర‌వుతున్నాయి. న‌ల‌భై ఏళ్ల ఇండ‌స్ట్రీ నేడు అలోల‌క్ష్మ‌ణా అనే ప‌రిస్థితి వ‌చ్చేసింది. 


మ‌రి ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు ముందున్న వ్యూహాలు ఏంటి? ఆయ‌న ఎలా ముందుకు వెళ్లాలి? ఎలా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలి? ఈ కీల‌క ప్ర‌శ్న‌ల చుట్టూనే ఏపీ ప‌రిస్థితి తిరుగుతోంది. ఒక‌టి నేరుగా తాను రంగంలోకి దిగి.. కేంద్రంతో తేల్చుకోవ‌డం, లేదా ఎంపీల‌తో రాజీనామాలు చేయించి ప‌రిష్కారానికి కృషి చేయ‌డం, లేదా తానే స్వ‌యంగా రాజీనామా చేసి.. ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసిన సీఎంగా గుర్తింపు తెచ్చుకుని మోడీపై పోరుకు రెడీ కావ‌డం. వీటికి మిన‌హా చంద్ర‌బాబు ముందున్న అస్త్రాలు మ‌రేమిటీ క‌నిపించ‌డం లేదు. సో.. ఇదీ ప‌రిస్థితి!! 


మరింత సమాచారం తెలుసుకోండి: