అదేంటో విశాఖ అంటే ఇటు ఏపీకి, అటు కేంద్రానికి కూడా చిన్న చూపు ఉన్నట్లు కనిపిస్తోంది. మొన్నటిని మొన్న ఏపీకి అన్నీ ఇచ్చేశాం, గిరిజన వర్శిటీ బిల్లు కూడా వర్షాకాల సమావేశాల్లొనే ఒకే  చేస్తామని చెప్పిన బీజేపీ పెద్దలు తీరా ఇపుడు అడ్డం తిరిగారు. ఈ రోజు పార్లమెంట్లో ఏపీ ఎంపీలు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి అర్జున్ రాం బదులిస్తూ ఈ సెషన్లో బిల్లు ఊసే లేదు పొమ్మన్నారు. అంటే ఈ సర్కార్ టైంలోనే వర్శిటీ రాదని చెప్పకనే చెప్పేశారన్న మాట.


ఊరిస్తూనే గడిపేశారు :


ఏపీలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు విభజన చట్టంలో ఉంది. దానికి వెనకబడిన ఉత్తరాంధ్రలో పెడతామని అన్నారు కూడా. ఇందుకోసం విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతంతో పాటు, విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలలో భూములను కూడా చూశారు. ఇక వర్శిటీ రావడమే ఆలస్యం అన్నట్లుగా కబుర్లు చెప్పిన కమలనాధులు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఫిరాయించేశారు.

ఈ సెషన్ అయిపోతే శీతాకాల సమవేశాలు కొద్ది రోజులు పెడితే పెడతారు. లేకపొతే ఓటాన్ అకౌంట్ పెట్టేసి ఎన్నికలకు పోతారు. సో, ఓ విధంగా ఈ ప్రాంతానికి గిరిజన వర్శిటీ ఆశ వదిలేసుకోవచ్చునని చెప్పేశారు. ఏపీలో గిరిజనులపైన తెలుగుదేశానికీ ప్రేమ లేదు, బీజేపీకి అంతకంటే లేదన్నది ప్రూవ్ అవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: